Begin typing your search above and press return to search.
వైసీపీలో జనసేన ఎమ్మెల్యే రాపాక కలకలం
By: Tupaki Desk | 17 Dec 2019 4:19 AM GMTకొత్త నీరు వస్తే పాత నీరు పోవాల్సిందే.. ఇప్పుడు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాకతో రాజోలు నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రాజుకుంది. జనసేన ఎమ్మెల్యే రాపాక రోజురోజుకు జగన్ కు దగ్గరవుతుండడం.. నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తుండడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో వేడి రగులుకుంటోంది.
రాజోలు వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జి బొంతు రాజేశ్వరరావును కాదని ప్రభుత్వ వ్యవహారాల్లో జనసేన ఎమ్మెల్యే రాపాక అన్నీ తానై నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వైసీపీలో రాపాకకు ప్రాధాన్యం ఇవ్వడంపై బొంతు వర్గం భగ్గుమంటోంది. రాపాక వైసీపీకి దగ్గరవ్వడంతో ఆయన ఏపార్టీలో ఉన్నారనే సంగతి నియోజకవర్గంలో ఏవరికి అంతుబట్టడం లేదట.. అటు రాపాక దూకుడుతో వైసీపీనే నమ్ముకొని మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు పరిస్థితి ఎటూ కాకుండా పోయింది.
ఇక రాజోలు నియోజకవర్గంలో వైసీపీ అమ్మాజీ అనే వైసీపీ మహిళ నేతను తెరపైకి తెచ్చింది వైసీపీ అధిష్టానం. ఆమెకు ఎస్సీ చైర్ పర్సన్ పదవి ఇవ్వడం కూడా కలకలం రేపింది. ఈ ఇద్దరిని తెరపైకి తేవడంతో వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జి బొంతును పక్కనపెట్టబోతున్నారనే చర్చ మొదలైంది.
రాపాక నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే రాపాక ఇప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ తానై నిర్వహిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలా అధికార పార్టీ తరుఫున వకాల్తా పుచ్చుకున్నారు. ఇక వైసీపీ అధిష్టానం కూడా రాజోలు నియోజకవర్గంలో అమ్మాజీ అనే వైసీపీ కార్యకర్తకు ఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చేసింది. దీంతో అటు ఎమ్మెల్యే, ఇటు అమ్మాజీ వల్ల అక్కడ వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన బొంతు రాజేశ్వరరావు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందట..