Begin typing your search above and press return to search.
అంత రచ్చకు కారణమైన పట్టాభి మాటల్నిచెప్పేసిన జగన్ సన్నిహితుడు
By: Tupaki Desk | 26 Oct 2021 4:03 AM GMTఏపీలో చోటు చేసుకున్న రాజకీయ రచ్చకు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలన్న సంగతి తెలిసిందే. ఆయనకు అసలైన అర్థం తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ ‘‘బోసిడీకే’’ అన్న పదం అనుచితమైనదని.. దాని అర్థం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన దాని ప్రకారం లం.. కొడకా అని. అలాంటి దారుణ పద ప్రయోగాన్ని ఒక ముఖ్యమంత్రి మీద ఎలా చేస్తారన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. ఇలాంటి ‘బోసిడీకే’ మాటలు చాలానే గతంలో వైసీపీ నేతల నోటి నుంచి రాలేదా? అన్న ప్రశ్న వస్తున్నా.. దాని మీద పెద్దగా చర్చ జరగని పరిస్థితి.
గౌరవ మర్యాదలన్నవి ముఖ్యమంత్రికి మాత్రమే కాదు.. చిన్న పిల్లాడి నుంచి పెద్ద వయస్కుల వరకు అన్ని వర్గాలకు.. అన్ని జాతులకు.. ధనిక పేద అన్న తేడా లేకుండా ఉండటం చాలా అవసరం. అది మిస్ అయినప్పుడు.. అలా మాట్లాడిన వారు ఎవరైనా సరే తప్పు పట్టాల్సిందే. తాజా ఎపిసోడ్ విషయానికి వస్తే.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన బోసిడేకే పద ప్రయోగం అభ్యంతరకరం. ఇందులో మరో మాటకు తావు లేదు.
అయితే.. ఇలాంటి పదాలు.. ఇంత కంటే దారుణమైన వ్యాఖ్యలు వైసీపీ నేతలు చేయలేదా? అన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వస్తోంది. గతం సంగతి తర్వాత.. బోసిడీకే అన్న మాటను ముఖ్యమంత్రిని ఎలా అంటారు? అని ప్రశ్నిస్తూనే టీడీపీ అధినేత ఆయన కుమారుడితో పాటు పలువురిని ఉద్దేశించి వైసీపీ నేతలు చేస్తున్న దారుణ వ్యాఖ్యల మాటేమిటి? అన్నది మరో ప్రశ్న. మొన్నటికి మొన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిగతాన్ని వేలెత్తి చూపేలా గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన దారుణ వ్యాఖ్యల సంగతేంటి? స్వర్గీయ ఎన్టీఆర్ పెంపకాన్నే వేలెత్తి చూపేలా ఆయన వ్యాఖ్యలు చూస్తే.. ఇటీవల కాలంలో అంతటి దారుణ వ్యాఖ్యలు మరెవరూ చేయలేదనే చెప్పాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీలో భారీ రాజకీయ రచ్చకు కారణమైన పట్టాభి.. ప్రెస్ మీట్ లో ఏమన్నారు? ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఏ సందర్భంలో.. ఎలా వచ్చాయి? అన్న దానిపై ఎవరూ చెప్పింది లేదు. ఈ కొరతను తీరుస్తూ తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వెల్లడించారు. అక్టోబరు 19న మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన పట్టాభి ఏమన్నారన్నది విజయసాయి వెల్లడించిన ప్రకటనలో చూస్తే..
‘తాడేపల్లి ప్యాలెస్ (ముఖ్యమంత్రి అధికారిక నివాసం)లో కూర్చొన్న దద్దమ్మకు నేను చెబుతున్నా. నీకు దమ్ముంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల పోలీసులకు నోటీసులు ఇవ్వు బోసిడీకే. నీకు దమ్ముంటే గుంటూరు ఎస్పీకి నోటీసు ఇవ్వండి. పబ్‌జీ దొరా.. వేరే ఎవరికైనా నోటీసులు ఇవ్వు.. మాకు కాదు. బోసిడీకే మాపై కాదు.. స్మగ్లర్లపై చర్యలు తీసు కోవడానికి యత్నించు..’ అంటూ దారుణ వ్యాఖ్యలు చేశారన్నారు. ఇలాంటి మాటలతో ముఖ్యమంత్రిని దూషిస్తే.. ఆయన్ను అభిమానించే వారి మనసులు గాయపడి రెచ్చపోవటానికి కారణమైందన్నట్లుగా విజయసాయి మాటలు ఉన్నాయి. మొత్తానికి పట్టాభి అన్న మాటలు ఏమిటన్న దానిపై విజయసాయి పుణ్యమా అని అందరికి క్లారిటీ వచ్చినట్లే.