Begin typing your search above and press return to search.
ముందు సర్పంచిగా గెలువు సామీ.. పవన్‌పై రోజా పంచ్‌లు!
By: Tupaki Desk | 19 Sep 2022 1:02 PM GMTవైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించా రు. రాజకీయాల నుంచి వ్యక్తిగతం వరకు.. అనేక అంశాలపై ఆమె సటైర్లు గుప్పించారు. దీనికి కారణం.. ఆదివారం జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన.. పార్టీ లీగల్ సెల్ నేతల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కేవలం 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు తనకు అందిన సర్వేలు.. కొందరు మేధావులు చెప్పిన దానిని బట్టి తాను ఈ విషయం వెల్లడిస్తున్నానని.. ఆయన అన్నారు. ఈ ప్రకటన సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
ఇక, వైసీపీ నాయకులకు కొంత కడుపు మంట కూడా పుట్టించింది. దీనిపైనే మంత్రి రోజా రియాక్ట్ అయ్యారు. పవన్‌పై సటైర్లు, విమర్శలతో విరుచుకుపడ్డారు. ``మాకు 45 సీట్లు వస్తాయని అంటే.. మిగిలిన 135 సీట్లు.. నీకు(జనసేన) వస్తాయని భావిస్తు న్నావా`` అని ప్రశ్నించారు. అంతేకాదు.. ముందు.. సర్పంచిగానో.. కౌన్సిలర్‌గానో.. వార్డుమెంబరు గానో.. గెలిచి చూపించు సామీ..! అంటూ.. తనదైన శైలిలో డైలాగులు గుప్పించారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు జాతకం చెబుతుంటే నవ్వొస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి సర్వేలను నమ్ముకుని ``జగన్ రెడ్డి సీఎం కాడు, కాలేడు.. ఇదే నా శాసనం`` అన్నావని మంత్రి రోజా గుర్తు చేశారు.
``అలాంటి శాసనాలు చేసిన నువ్వు(పవన్) సభలో అడుగు పెట్టలేక పోయావు. గుర్తుంచుకో`` అని రోజా సటైర్లు పేల్చారు. కనీసం 175 నియోజకవర్గాల్లో జనసేనకు పోటీ చేసే అభ్యర్థులే లేరని, అలాంటి పార్టీ అధ్యక్షుడు పవన్ అసెంబ్లీపై పార్టీ జెండా ఎగురవేస్తారట అని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు. కౌన్సిలర్‌గా, ఎంపీటీసీ, సర్పంచ్‌లుగా గెలవాలని, ఆ తర్వాత ఎమ్మెల్యే విషయాన్ని ఆలోచిద్దామని రోజా సలహా ఇచ్చారు. గ్రామస్థాయిలో పవన్ సభలు పెడితే.. కేవలం ఆయనపై ఉన్న సినిమా మోజుతోనే ప్రజలు వచ్చారని.. అన్నారు. పవన్ సీఎం అవుతానని కలలు కంటున్నాడని... అలాంటి కలలతో గతంలో ఎలా బొక్క బోర్లా పడ్డావో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రం ఈ రోజు నాశనం కావడానికి .. నువ్వు.. నువ్వు మద్దతిచ్చిన చంద్రబాబు కారణం కాదా..? అని రోజా ప్రశ్నించారు. సినీ పరిశ్రమ నుంచి వచ్చి ఎన్టీఆర్ టీడీపీ పెట్టి, దమ్మున్న మగాడిలా ఒంటరిగా పోటీ చేశారన్నారు. చిరంజీవి కూడా సింగిల్‌గా పోటీ చేశారని చెప్పుకొచ్చారు. కానీ అదే రక్తం పంచుకు పుట్టిన నువ్వు 2014లో ఎన్నికలకు వెళ్లావా? అని నిలదీశారు. ప్యాకేజీలు తీసుకుని బీజేపీ, టీడీపీకి ఓట్లు వేయాలని ప్రచారం చేశావని రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సింగిల్‌గా రా!
జనసేనాని పవన్ కల్యాణ్‌కు రోజా సవాల్ విసిరారు. ``నీ జెండా, అజెండా మీద నమ్మకం వుంటే , 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపగలననే నమ్మకం వుంటే, నీకు దమ్ము, ధైర్యం వుంటే జగన్‌తో సింగిల్‌గా పోటీ చేయ్`` అని సవాల్ విసిరారు. ఊరికే ప్యాకేజీల కోసం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని పవన్‌ను నిలదీశారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి కరకట్టలో దాక్కున్న చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని రోజా ప్రశ్నించారు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.