Begin typing your search above and press return to search.
అయ్యన్న ఇంటి ముట్టడి.. మరోసారి ఉద్రిక్తత
By: Tupaki Desk | 18 Sep 2021 10:15 AM GMTటీడీపీ నేత అయ్యన్న టార్గెట్ గా వైసీపీ నేతల దూకుడు కొనసాగుతోంది. నిన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై రాళ్లదాడికి పాల్పడిన నేతలు శనివారం టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడును టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలు దేరారు. అయ్యన్నపాత్రుడిని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం తీవ్రమైంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
వైసీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులకు ఉమాశంకర్ ఫిర్యాదు చేశారు.
అయ్యన్న వ్యాఖ్యల్లో అభ్యంతరం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. శాంతియుత ఆందోళనలు చేయడం.. రాజకీయాల్లో సంప్రదాయంగా వస్తోందంటున్నారు. కానీ ఇలా దౌర్జన్యాలకు పాల్పడడం వైసీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని మండిపడుతున్నారు.
మొత్తంగా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈరోజు అయ్యన్నపాత్రుడిని టార్గెట్ చేసి ఆందోళన బాట వైసీపీ నేతలు వారి విమర్శలపై ఘాటుగా స్పందిస్తున్న తీరు చర్చనీయాంశమైంది.