Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నికలపై వైసీపీ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   31 Oct 2019 11:23 AM GMT
స్థానిక ఎన్నికలపై వైసీపీ కీలక నిర్ణయం
X
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మూడు నెలల్లోనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుపుతామని వైసీపీ ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ఈ అఖండ గెలుపు తెచ్చిన ఊపులోనే నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించడానికి వైసీపీ సర్కారు రెడీ అయ్యింది.

అయితే జగన్ ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇచ్చిన రిజర్వేషన్ల కోటాను పెంచడానికి ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం కోటాను అమలు చేయడానికి రెడీ అయ్యింది.ఇందుకోసం కోర్టును ఒప్పించడానికి సమాయత్తమవుతోంది. డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం స్థానిక సంస్థల్లో గతంలో ఉన్నట్లే 59.85శాతం కోటా అమలు చేశాకే ఎన్నికలకు వెళతామని ప్రకటించారు.

ఇసుక కొరతతో కూడా మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి స్పందించారు. ఇసుక కొరత కారణంగా చనిపోయినట్టు టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. ఏదో కారణంతో చనిపోతే దానికి ఆపాదిస్తున్నారని.. నదులు, వాగుల్లో నీరు ఉండడంతోనే ఇసుక దొరకడం లేదన్నారు. ఇది అన్ సీజన్ అని ఇసుక ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. 16 ఏళ్లలో ఎప్పుడైనా మూడు నెలలపాటు కృష్ణా నదిలో నీళ్లు ప్రవహించాయా అని బొత్స ప్రశ్నించారు. ఇసుకను భూతంలా చూపించి తప్పు పట్టాలని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగాల్లో ఓసీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించాలని వచ్చిన డిమాండ్ మేరకు సీఎం దృష్టికి తీసుకెళుతామన్నారు.