Begin typing your search above and press return to search.

వైసీపీ సర్వేలు ఫర్ సేల్...?

By:  Tupaki Desk   |   30 Aug 2022 10:48 AM GMT
వైసీపీ సర్వేలు ఫర్ సేల్...?
X
2024 ఎన్నికల కోసం అపుడే వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకు అంటే గడప గడపకు ప్రోగ్రాం తోనే ఆయన అధికారంలోకి వచ్చారు. ఆ ప్రోగ్రాం ఆ రోజున పార్టీకి కానీ పోటీ చేసిన అభ్యర్ధులకు కానీ ఎంత ఇంపార్టెంట్ గా యూజ్ అయినది అన్నది వైసీపీ వాళ్ళకు బాగా తెలుసు. జగన్ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పాదయాత్ర యాభై శాతం అయితే మరో యాభై శాతం గడప గడపకు వైసీపీ అనేది నిజం. అలా వైసీపీని అధికారంలోకి ఈ ప్రోగ్రాం తెచ్చింది.

అయితే ఇపుడు గడప గడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలకు ఏ మాత్రం వర్కౌట్ కావడంలేదు అంటున్నారు. అయితే హై కమాండ్ మాత్రం ఎందుకు సక్సెస్ కావడం లేదు అని కొన్ని సర్వేలు చేయించింది. అలా వివిధ ఏంజెన్సీల ద్వారా అనేక రకాలైన సర్వేలు ఇపుడు జరిపిస్తున్నారుట.

అయితే ఇటీవల ఒక సంస్థ ద్వారా రాష్ట్రమంతా నాలుగు కోట్ల మంది ఏపీ జనాల మూడ్ ఎలా ఉంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారుట. ఈ సర్వేల ద్వారా ఎమ్మెల్యేల మీద జనాభిప్రాయం ఎలా ఉంది, ప్రభుత్వం మీద ఎలా ఉంది, ఇక ప్రతిపక్షం టీడీపీ వాళ్ల పరిస్థితి ఎలా ఉంది అన్నది పక్కాగా సర్వే చేయించడానికి ఒప్పందం కుదుర్చుకుని మరీ ఈ సర్వే చేయిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇలా సర్వే చేస్తున్న టీమ్ ఇస్తున్న నివేదికలకు సీఎంఓ ఆఫీసులోని నివేదికలకు మధ్య అతి పెద్ద తేడా ఇటీవల కాలంలో కనిపిస్తోంది అంటున్నారు.

దానికి ఉదాహరణ అన్నట్లుగా ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే మీద విపరీతమైన వ్యతిరేకత ఉందని ఒక సర్వే నివేదిక తేల్చిపడేసింది. అయితే ఆ నియోజకవర్గం మీద ఇపుడు చేయిస్తున్న ఒక సర్వే నివేదిక చూస్తే ఆయనకు జనాల మద్దతు 75 శాతం ఇచ్చారని అంటున్నారు. అయితే మిగిలిన సర్వేలలో అతనికి 22 శాతం కూడా రాలేదు అని తెలుస్తోందిట. మొత్తానికి ఆ సర్వే వివరాలు కనుక్కుంటే సర్వే చేసిన తరువాత సర్వే యాజమాన్యం నేరుగా ఆ ఎమ్మెల్యేను కలసి ఇదీ పరిస్థితి అని చెప్పేశారుట. దాంతో ఆ ఎమ్మెల్యే వారితో బేరం కుదుర్చుకుని పెద్ద ఎత్తున ముట్టచెప్పి సర్వే ఫలితాన్ని మార్చేలా చేశారు అని అంటున్నారు.

ఇక ఇదే విషయం మీద ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ కూడా సాగింది అంటున్నారు. ఆ ఎమ్మెల్యే మీద గుర్రుగా ఉన్న కొందరు ఇపుడు ఈ విషయం లీక్ చేస్తున్నారు అని అంటున్నారు. మా ఎమ్మెల్యే 2019 ఎన్నికల ముందు కూడా ఇలాగే పీకే టీమ్ ని మ్యానేజ్ చేసి సీటు తెచ్చుకున్నాడు అని వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక జిమ్మిక్ చేసి తెచ్చుకుంటాడు అని ఆయన అనుచరులే చెబుతున్నారుట.

దీంతో ఈ పరిస్థితిని చూసిన వారు అంతా వైసీపీ సర్వేలు ఫర్ సేల్ అంటున్నారు. మరి సర్వేలతో ఏదో చేద్దామని, కరెక్ట్ ఒపీనియన్ తీసుకుని జనాల్లో వ్యతిరేకత లేని వాళ్లకే టికెట్ ఇద్దామని వైసీపీ హై కమాండ్ ఆపసోపాలు పడుతున్న వేళ ఇలా సర్వే ఫలితాలు మార్చేసి రావడం అంటే ఏం చేస్తారో అని అంటున్నారు.

మరి వాటినే గుడ్డిగా అనుసరించి ఫెయిల్ అయిన వారికే టికెట్లు ఇచ్చుకుంటూ పోతారా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా అధినాయకుడు సర్వేలను నమ్ముకున్నారని తెలిసి ఆ ఎత్తుకు మించిన ఎత్తులు వేస్తున్న వైసీపీ వారు పాలిట్రిక్స్ ఇపుడు పార్టీలో భారీ ఎత్తున చర్చకు తావిస్తున్నాయి. మరి ఇలాగే అంతా సాగితే చివరికి మిగిలేదేంటి అని అసలైన అభిమానులు వాపోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.