Begin typing your search above and press return to search.

ఏపీ లో లేని పార్టీని త‌ట్టి లేపిన‌ట్టు అవుతున్న‌ట్టు కాదా?

By:  Tupaki Desk   |   12 Aug 2021 3:30 PM GMT
ఏపీ లో లేని పార్టీని త‌ట్టి లేపిన‌ట్టు అవుతున్న‌ట్టు కాదా?
X
ఇప్పుడు ఇదే మాట వైసీపీలో జోరుగా వినిపిస్తోంది. రాష్ట్ర బీజేపీకి వైసీపీ ఇంత క‌న్నా ఏం చ‌య‌గ‌ల‌రు..? అనే విస్మ‌యం నేత‌ల మ‌ధ్య వ్య‌క్త‌మ‌వుతోంది. నిజానికి బీజేపీ ఏపీ శాఖ విష‌యాన్ని తీసుకుంటే.. ప్ర‌త్యేక హోదాపై ఎప్పుడైతే.. బీజేపీ నేత‌ల టంగ్ త‌డ‌బ‌డిందో.. అప్పుడే ఏపీ ప్ర‌జ‌లు బీజేపీని ప‌క్క‌న పెట్టారు. ఆ పార్టీ ఒక‌టి ఉంద‌ని.. నాయ‌కులు ఉన్నార‌ని.. కూడా ప‌ట్టించుకోవ‌డం మానేశారు. తిరు ప‌తి ఉప పోరులో ఈ విష‌యం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు ప్ర‌జ‌లుచూపించారు. క‌నీసం నోటాతో పోటీ కూడా ప‌డ‌లేని పరిస్థితి.. బీజేపీకి ఎదురైంది.

ఇక‌, స్థానిక పోరులోనూ బీజేపీని ప‌ట్టించుకున్న వారు క‌నిపించ‌లేదు. ఇక‌, ప్ర‌ధాన మీడియా కూడా బీజేపీ వార్త‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. అంటే ఒకర‌కంగా.. రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి జీవ‌చ్ఛ‌వంలా మారింది. అలాంటి బీజేపీకి జ‌గ‌న్ చేసిన సాయం మ‌రువ‌లేనిద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యంపై వైసీపీలోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఎందుకంటే.. గ‌డిచిన వారం రోజులుగా వైసీపీ కీల‌క నాయ‌కులు బీజేపీకి భ‌జ‌న చేస్తున్నారు. మంత్రుల నుంచి మొద‌లు పెట్టి.. ఎమ్మెల్యేల వ‌ర‌కు కూడా అంద‌రూ బీజేపీ స్మ‌ర‌ణ‌లో మునిగి తేలుతున్నారు.

బీజేపీ త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేసేందుకు ప‌న్నాగం ప‌న్నుతోంద‌ని.. అంద‌రూ క‌లిసి త‌మ స‌ర్కారును కూల‌గొట్టి.. బీజేపీ కండువా క‌ప్పుకొన్న నాయ‌కుడిని ఒక‌రిని సీఎం చేసేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నార‌ని.. మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌ల త‌ర్వాత‌.. ఒక్క‌సారిగా బీజేపీ గురించి అంద‌రూ ఆలోచించ‌డం ప్రారంభించారు. పెద్ద ఎత్తున వెబ్ సైట్ల‌లో వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇక‌, టీవీ డిబేట్ల‌లోనూ బీజేపీ గురించే చ‌ర్చించారు. ఈ ప‌రిణామాలు.. ఇలా సాగుతుండ‌గానే.. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నేత‌ల‌ను టార్గెట్‌ చేస్తున్నారు.

ఇదంతా చూస్తున్న‌వారిని ప‌నిగ‌ట్టుకుని బీజేపీకి వైసీపీ మైలేజీ ఇస్తున్నార‌ని అంటున్నారు. ఇది అన‌వ‌సరంగా ఇస్తున్న మైలేజీ వ‌ల్ల బీజేపీ ల‌బ్ధి పొందుతోంద‌ని చెబుతున్నారు. ఇలాంటి ప‌రిణామాల కార‌ణంగా అన‌వ‌స‌రం గా లేని పార్టీని త‌ట్టి లేపిన‌ట్టు అవుతున్న‌ట్టు కాదా? అనే ప్ర‌శ్న వ‌స్తోంది. ఇదే విష‌యాన్ని సీనియ‌ర్లు కూడా పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి దీనిపై అంత‌ర్గ‌త చ‌ర్చ చేసుకుంటారా.. లేక ఇదే పంథాను కొన‌సాగిస్తారా? అనేది చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.