Begin typing your search above and press return to search.
వైసీపీ..టీడీపీ... కొత్త కామ్రేడ్ షాకింగ్ విశ్లేషణ... ?
By: Tupaki Desk | 1 Jan 2022 1:30 PM GMTఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అధికారంలో వైసీపీ రెండున్నరేళ్ళుగా కుదురుకుంది. ఇక విపక్ష పాత్రలో టీడీపీ ఉంది. ఈ రోజు వరకూ చూస్తే ఈ రెండు పార్టీల మధ్యనే ఏపీ రాజకీయం మొత్తం కేంద్రీకృతమై ఉంది. అటూ ఇటూ మోహరించి ఉన్న పార్టీలు కూడా ఈ రెండే. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ కి జనాలలో తీవ్ర వ్యతిరేకత ఉందని అంటారు. అలాగే టీడీపీ పుంజుకుంటోంది అని కూడా అంచనాలు కడుతూ ఉంటారు. దీని మీద ఏపీ సీపీఎం కి రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగా నియమితుడు అయిన వి శ్రీనివాసరావు తనదైన రాజకీయ విశ్లేషణ చేసినట్లుగా తెలుస్తోంది. ఏపిలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూలత ఉందని సీపీఎం అభిప్రాయపడినట్లు ఆ పార్టీ రాష్ట్ర కొత్త కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు.
ఏపీలో రాజకీయ పరిస్థితులు, ప్రధానా పార్టీలు తీరుతెన్నులు, వర్తమాన సామాజిక అంశాలపైన ఏపీ సీపీఎం లోతైన విశ్లేషణ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా వైసీపీ ఏపీలో ఈ రోజుకీ బలంగానే ఉంది అన్నది ఆ పార్టీ భావనగా చెబుతున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున అమలవుతున్న సంక్షేమ పధలక పట్ల ప్రజలలలో సానుకూలత ఉందని సీపీఎం అభిప్రాయపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కొత్త కార్యదర్శి చెబుతున్నారు. .
అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, మైనారిటీలు, దళితులు, ఆదివాసీలలో వైసీపీకి ఆదరణ ఉన్నట్లుగా ఉన్నట్లుగా సీపీఎం మార్క్ విశ్లేషణగా ఉంది. ఇక మిగిలిన వర్గాల్లో అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తం అవుతోంది అని ఆయన చెబుతున్నారు. మరో వైపు చూస్తే వరస ఎన్నికలలో దక్కిన ఓటమితో టీడీపీలో తీవ్ర నిరుత్సాహం ఉందని సీపీఎం నేతలు భావిస్తున్నారట. ఇక తెలుగుదేశం పూర్వ వైభవం కోసం చేస్తున్న ప్రయంతాలు అయితే ఇప్పటిదాకా పెద్దగా ఫలించడం లేదనే ఆ పార్టీ నేతల ఆలోచనగా ఉందని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడాలి అన్న టీడీపీ ఆలోచనలు కానీ మహానాడులో ఆ పార్టీ బీజేపీతో చెలిమి కోసం చేసిన తీర్మానం కానీ సీపీఎం కి రుచించడం లేదు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే సీపీఎం నుంచి వైసీపీకి ఒక బంపర్ ఆఫర్ అయితే వస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ పోరాడితే తాము మద్దతు ఇస్తామని, ఉమ్మడి పోరాటాలకు కూడా రెడీగా ఉంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు
వైసీపీతో తమకు భావస్వారూప్యంలేదని, అయినా బీజేపీని ఎదిరించేందుకు వైసీపీతో పనిచేస్తామని అంటున్నారు. ఇప్పటికైతే ఏపీలో వైసీపీ ఒంటరిగానే ఉంది. పొత్తులకు కూడా ఆసక్తి చూపడం లేదు, కానీ సీపీఎం మాత్రం వైసీపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి 2024 ఎన్నికలకు చాలా టైమ్ ఉంది. ఏపీలో ఒంటరి పోరుకు ఈసారి ఇష్టం లేకపోయినా వైసీపీ వైఖరిలో మార్పు వచ్చినా ఈ రెండు పార్టీలు ఫ్యూచర్ లో కలసి ముందుకు సాగుతాయేమో చూడాలి.