Begin typing your search above and press return to search.
కమ్మగా కరుణిస్తారా...కొడాలికి ఇంకోసారి...?
By: Tupaki Desk | 28 Nov 2022 12:30 AM GMTఏపీలో అత్యంత ప్రభావవంతమైన సామాజిక వర్గం కమ్మలు. ఆ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలూ లేవు. వారు స్వాతంత్రం ముందు నుంచి కూడా తమ సత్తా చాటుకుంటూ వస్తున్నారు. అలాంటి ఆవర్గానికి స్వాతంత్రం వచ్చిన తరువాత తొలిసారిగా మంత్రివర్గంలో చోటు లేకుండా పోవడం కేవలం జగన్ క్యాబినెట్ లోనే జరిగింది.
కమ్మల విషయం తీసుకుంటే వారు కాంగ్రెస్ ఏలుబడిలోనూ కీలకమైన పదవులు పొందారు. ఎన్నో శాఖలకు మంత్రులుగా వ్యవహరించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి సీటు కోసం పేచీ వచ్చినపుడే తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఆ విధంగా కమ్మలు మెయిన్ స్ట్రీం పాలిటిక్స్ లోకి దూసుకు వచ్చి గత అర్ధ శతాబ్ద కాలంగా సత్తా చాటుకుంటూనే ఉన్నారు.
ఏపీలో చూసుకుంటే కోస్తా జిల్లాలలో వారి ప్రభావం రాజకీయంగా గణనీయంగా ఉంటుంది. అందుకే ఏ రాజకీయ పార్టీ కూడా వారిని విస్మరించడంలేదు. అంతవరకూ ఎందుకు వారికంటూ ప్రత్యేక పార్టీగా టీడీపీని చెబుతున్నా అందరూ ఆ వైపుగా వెళ్ళలేదు. వారిని అలా పోనీయకుండా చూసుకున్నారు కూడా.
కాంగ్రెస్ ఏలుబడిలో ముఖ్యంగా వైఎస్సార్ సీఎం గా ఉండగా కూడా కమ్మలకు కీలక శాఖలు ఇచ్చారు. అలాగే కేంద్రంలో కూడా మంత్రి పదవులు ఆయన ఇప్పించగలిగారు. అలా నాటి కాంగ్రెస్ లో దగ్గుబాటి పురందేశ్వరి, రాయపాటి, కావూరి, పిన్నమనేని వంటి వారు బలమైన కమ్మలుగా కనిపిస్తారు.
ఇక తెలంగాణాలో చూసుకుంటే జనాభా పరంగా తక్కువగా ఉన్నప్పటికీ కేసీయార్ తన మంత్రివర్గంలో వారికి చోటిచ్చి పక్కన పెట్టుకున్నారు. ఎందుకంటే ముందే చెప్పినట్లుగా రాజకీయంగా వారి ప్రభావం చాలా ఉంటుంది. మరి ఏపీలో చూస్తే కమ్మలకు జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కలేదు.
ఇది నిజంగా వారిని బాధించే అంశంగా ఉంది. దీంతో ఆ సామాజికవర్గం రగులుతోంది. అసలే వారి మీద ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చూపుతున్నాయని విమర్శలు వస్తున్న నేపధ్యంలో కమ్మలకు ఇపుడు రాజకీయంగా కూడా దెబ్బేసేలా వైసీపీ చర్యలు ఉన్నాయని అంటున్నారు.
దీని మీదనే ఇటీవల సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కూడా గళం విప్పారు. కమ్మలకు ఏపీలో తీరని అన్యాయం జరుగుతోంది అని ఆయన అనడం అందులో భాగమే. ఇపుడు ఆ విషయం వైసీపీ హై కమాండ్ సీరియస్ గానే ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. కమ్మలలో మెజారిటీ టీడీపీ వైపు ఉన్నారని అంటున్నా వారి ఓట్లు ఎపుడూ పోలరైజ్ కాలేదు.
కానీ ఫస్ట్ టైం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కమ్మలు మొత్తానికి మొత్తంగా టీడీపీకి జై కొడితే పరిస్థితి ఇబ్బందిలో పడుతుందని ఊహిస్తున్న వైసీపీ హై కమాండ్ కమ్మలకు ప్రతినిధిగా భావించే మాజీ మంత్రి కొడాలి నానికి మరోసారి మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని సామాజికవర్గాలను కలుపుకుని పోవాలన్న వైసీపీ వ్యూహాల మేరకే ఈ నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. మరి కొడాలి నాని మంత్రి అయ్యేది ఎపుడు అంటే చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.