Begin typing your search above and press return to search.
వైసీపీ వర్సెస్ టీడీపీ .. చంద్రబాబు ఇల్లు ముట్టడి, జోగి రమేష్ అరెస్ట్
By: Tupaki Desk | 17 Sep 2021 9:47 AM GMTఏపీలో రాజకీయం చిలికి చిలికి గాలివాన లా మారుతోంది. టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరి ఏకంగా చంద్రబాబు ఇంటిని ముట్టడించడానికి వైసీపీ నేతలు ప్రయత్నించడం, వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ , టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల రచ్చ చిలికి చిలికి గాలివానగా మారి ఉద్రిక్తతకు కారణమైంది.
విశాఖ జిల్లా నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ ను దూషించారంటూ కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కార్యకర్తలను తీసుకుని చంద్రబాబు ఇంటి ముట్టడికి వెళ్లారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కర్రలు, జెండాలతో చంద్రబాబు ఇంటిని ముట్టడించారు. వాళ్లు వస్తున్న సంగతి తెలుసుకున్న పోలీసులు భారీగా తరలి వచ్చారు. అదే టైంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా చంద్రబాబు ఇంటికి వలయంగా ఏర్పడ్డారు. అటు నుంచి వైసీపీ కార్యకర్తలు, ఇటు నుంచి టీడీపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ నుంచి బుద్దా వెంకన్న, వైసీపీ నుంచి జోగి రమేష్ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు.
చంద్రబాబు ఇంటి వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చమని చెబుతున్నారు జోగి రమేష్. టీడీపీ నేతలే తమపై దాడి చేశారని జోగి రమేష్ ఆరోపించారు. తన కారును టీడీపీ నేతలు పగుల గొట్టారని తెలిపారు. చంద్రబాబు తనపై దాడి చేయించారని విమర్శించారు. జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో పడుకోవడం కాదు దమ్ముంటే బయటకు వస్తే తేల్చుకుందామని సవాల్ చేశారాయన. చంద్రబాబు, ఆయన కొడుకు సంగతి చూస్తామని హెచ్చరించారు. తీవ్ర స్థాయిలో రచ్చ అయిన తర్వాత పోలీసులు జోగి రమేష్‌ను అక్కడ్నుంచి తీసుకెళ్లారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య బుద్ధ వెంకన్న సొమ్మసిల్లి పడిపోయారు.
ఆందోళనకారుల దాడిలో ఎమ్మెల్యే జోగి రమేష్ కారు అద్దం ధ్వంసమైంది.దీనిపై టీడీపీ మండిపడుతోంది. చంద్రబాబు ఇంట్లోకి వైసీపీ గుండాలు చొరబడి దాడి చేశారని అడ్డుకున్న టిడిపి నేతలపై రాళ్ళ దాడులకు పాల్పడ్డారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలని ఏం అనడంలేదని టీడీపీ నేతలని తోసేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. నర్సీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి కౌంటర్‌గా వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటి ముట్టడికి వచ్చారు. టిడిపి నేత చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని చంద్రబాబు ఇంటిని ముట్టడించిన వైసీపీ నేతలు చంద్రబాబు పై ధ్వజమెత్తారు
ఉండవల్లి లోని చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తామని వైసీపీ నేత జోగి రమేష్ ముందే చెప్పినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సున్నితమైన ఘటన కావడం, నేతల్ని అఢ్డుకునేందుకు పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇది కాస్తా భౌతిక దాడుల వరకూ వెళ్లింది. ముఖ్యంగా టీడీపీ నేత బుద్దా వెంకన్నతో జోగి రమేష్ వాగ్వాదం తర్వాత పరిస్ధితిని అదుపు తప్పింది. జోగి రమేష్కారు అద్దం కూడా ధ్వంసం అయిన తర్వాత కూడా చాలా సేపు ఆయన అక్కడే ఉన్నారు. చివరికి పోలీసులు మంగళగిరి పీఎస్ కు జోగి రమేష్ ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ ను తరలించారు. దీనితో ప్రస్తుతం అక్కడ పరిస్థితి కొంచెం చల్లబడింది.