Begin typing your search above and press return to search.

జేసీ బ్ర‌ద‌ర్స్‌ను కుక్క‌ల‌తో పోల్చేశారుగా!

By:  Tupaki Desk   |   5 March 2017 1:57 PM GMT
జేసీ బ్ర‌ద‌ర్స్‌ను కుక్క‌ల‌తో పోల్చేశారుగా!
X
టీడీపీ నేత‌. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి నిన్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విరుచుకుప‌డిన వైనంపై ఓ మ‌హిళ వ్య‌క్తం చేసిన ఆవేశ‌పూరిత ప్ర‌సంగం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. స‌భ్య‌త‌, సంస్కారం మ‌రిచి జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మాట్లాడారంటూ ఆ మ‌హిళ వ్య‌క్తం చేసిన ఆగ్ర‌హావేశాల‌కు సంబంధించిన వీడియోలో హల్ చ‌ల్ చేస్తోంద‌నే చెప్పాలి. 3.24 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆ మ‌హిళ జేసీ బ్ర‌ద‌ర్స్‌ ను నిజంగానే ఉతికి ఆరేశారు. మొన్న కృష్ణా జిల్లా నందిగామ స‌మీపంలో దివాక‌ర్ ట్రావెల్స్‌ కు చెందిన బ‌స్సు ప్ర‌మాదంలో 10 మంది చ‌నిపోగా 30 మందికిపైగా గాయాల‌పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై విపక్ష నేత హోదాలో జ‌గ‌న్ తీవ్రంగా మండిప‌డ్డారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వారిపై కేసులు పెట్ట‌రేంట‌ని కూడా జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అయినా ట్రావెల్స్ య‌జ‌మాని టీడీపీకి చెందిన వారే కాబట్టి, నిందితుల‌ను చంద్రబాబు కాపాడుతున్నార‌ని కూడా జ‌గ‌న్ ఆరోపించారు.

ప్ర‌మాదం జ‌రిగిన విష‌యానికి సంబంధించి జ‌వాబు లేని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పేందుకు ముందుకు రాని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి... చంద్ర‌బాబు త‌మ‌ను ఎలా కాపాడుతున్నారో చెప్పాలంటూ జ‌గ‌న్ కుటుంబం ఆధ్వ‌ర్యంలోని సాక్షి ప‌త్రిక కార్యాల‌యం ముందు నిన్న త‌న కుమారుడు అస్మిత్ రెడ్డితో క‌లిసి వెళ్లి ధ‌ర్నాకు దిగారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంద‌న్న విష‌యాన్ని మ‌రిచి సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే ధ‌ర్నాకు దిగ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేగాయి. అయితే ధ‌ర్నా సంద‌ర్భంగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి... జ‌గ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దారుణంగానే ఉన్నాయి. ఓ ప్ర‌జాప్ర‌తినిధిగా ఏ ఒక్క‌రు కూడా ఇలా మాట్లాడ‌ర‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అయితే తాను ఎమ్మెల్యేన‌న్న విష‌యాన్ని కూడా మ‌రిచిపోయిన ప్ర‌భాక‌ర్ రెడ్డి... జ‌గ‌న్ ను ఉద్దేశించి అమ్మ‌ - అక్క అంటూ స‌భ్య‌స‌మాజం త‌ల దించుకునేలా మాట్లాడారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై ఓ మ‌హిళ త‌న ధ‌ర్మాగ్ర‌హాన్ని భారీ స్థాయిలోనే వ్య‌క్తం చేసింది. జేసీ బ్ర‌ద‌ర్స్‌పై తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను వీడియోలో చిత్రీక‌రించిన స‌ద‌రు మ‌హిళ.. ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసేసింది. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి నిన్న మ‌ధ్యాహ్నం జ‌గ‌న్ పై విరుచుకుప‌డ‌గా, ఆ మ‌హిళ మాత్రం నిన్న రాత్రి స‌రిగ్గా 7.59 గంట‌ల‌కు త‌న ధ‌ర్మాగ్ర‌హాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 24 గంట‌లు తిర‌క్క‌ముందే ఈ వీడియోకు 1.86 ల‌క్ష‌ల వ్యూస్ తో పాటు ఆరున్న‌ర వేల‌కు పైగా హిట్లు, 5,700ల‌కు పైగా షేర్లు, 2,100కు పైగా కామెంట్స్ వ‌చ్చాయి. ఇంకా ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా ఉంది. స‌మ‌యం గ‌డిచే కొద్దీ ఈ వీడియో మ‌రింత‌గా వైర‌ల్ గా మారుతోంది. అయినా ఆ వీడియోలో స‌ద‌రు మ‌హిళ‌... జేసీ బ్ర‌ద‌ర్స్ పై చేసిన కామెంట్స్ వింటే... ఆమె వ్యాఖ్య‌ల్లోని ధ‌ర్మాగ్ర‌హం స‌రైందేన‌నే భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.

జేసీ బ్ర‌ద‌ర్స్ ను... కుక్క‌లు, తాగుబోతులు, డ‌బ్బు మ‌ద‌మెక్కిన వ్య‌క్తుల‌లు, సిగ్గులేని రాజ‌కీయ నేత‌లు, బేవ‌ర్స్, పిచ్చికుక్క‌లు, మ‌ద‌మెక్కి, పిచ్చెక్కి రోడ్ల‌పైకి వ‌చ్చే దుష్టుల‌తో పోల్చిన ఆ మ‌హిళ‌... జ‌గ‌న్‌పై జేసీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ చెల‌రేగిపోయారు. జేసీ నోట వెంట వ‌చ్చిన అమ్మ‌, అక్క ప‌దాల‌ను ప్ర‌స్తావించిన ఆమె... జేసీకి కూడా అమ్మ‌, అక్క‌లు ఉన్నారుగా అంటూ త‌న‌దైన స్టైల్లో ఫైరైపోయారు. జ‌గ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను జేసీ... త‌న అమ్మ‌, అక్క‌, భార్య‌, కూతుళ్ల‌కు చూపించాల‌ని కూడా ఆమె స‌వాల్ చేశారు.

మీ కుటుంబ స‌భ్యులు స‌ద‌రు వీడియోను స‌మ‌ర్దిస్తే... అప్పుడు మ‌ళ్లీ రోడ్డుకు మీదకు రావాలంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు జేసీ గాలి తీసేశాయ‌నే చెప్పాలి. లేదంటే అలాంటి వ్యాఖ్య‌లు త‌ప్పేన‌ని మీ కుటుంబ స‌భ్యులు నీ ముఖాన ఊస్తే... అక్క‌డే ఉరేసుకుని చావాలంటూ ఆమె జేసీకి స‌ల‌హా ఇచ్చారు. జేసీ సీనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ వీరావేశంతో మాట్లాడుతున్నార‌ని ఆరోపించిన ఆమె... వ‌య‌సులో చిన్నోడైనా జ‌గ‌న్ స‌హ‌నంతో ఉన్నార‌ని, జ‌గ‌న్ లో గ‌నుక స‌హ‌నం న‌శిస్తే.. జేసీ బ్ర‌ద‌ర్స్ ఎక్క‌డికి వెళ్లాలో కూడా తెలియ‌ని స్థితిలో ప‌డ‌తారంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఏదేమైనా... జ‌గ‌న్‌ పై స్థాయికి మించి బూతు పురాణం అందుకున్న జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి... ఆ మ‌హిళ‌తో స్వ‌యంగా తిట్లు తిన్న‌ట్లు ఉంది క‌దూ.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/