Begin typing your search above and press return to search.
లోకల్ ఫైట్...ఏజెన్సీలోనూ వైసీపీదే గెలుపు
By: Tupaki Desk | 18 Feb 2021 1:30 PM GMTఏపీలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటిదాకా మూడు విడతల ఎన్నికలు ముగియగా.. చివరి విడత అయిన నాలుగో విడత ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పూర్తి అయిపోయిన తొలి రెండు విడతల ఎన్నికల్లో విపక్ష టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించిన అధికార వైసీపీ... మూడో విడత ఎన్నికల్లోనూ తన జోరును కొనసాగించింది. మైదాన ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వైసీపీ తిరుగులేని ఆధిక్యతను సంపాదించుకుంది. బుధవారం వెలువడిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేసిందని చెప్పక తప్పదు.
మూడో దశ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని పలు డివిజన్లలో ఎన్నికలు జరగగా... ఉత్తరాంధ్రలోని ఏజెన్సీకి చెందిన రంపచోడవరం నియోజకవర్గంలోనూ ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 11 గిరిజన మండలాలు ఉండగా.. వాటిలో మొత్తం 186 పంచాయతీలున్నాయి. వీటికి జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ... ఏ ఒక్కరూ ఊహించని విధంగా 137 పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసింది. వైసీపీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులే ఈ 137 పంచాయతీల్లో సర్పంచ్ లుగా గెలిచారు. చింతూరు మండలంలో 18, అడ్డతీగలలో 21, గంగవరంలో 15, ఏటపాకలో 14, రంపచోడవరం, వై.రామవరం మండలాల్లో 13 పంచాయతీల చొప్పున వైసీపీ విజయం సాధించింది.
ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఘోరంగా ఓటమిపాలైన విపక్ష టీడీపీ ఏజెన్సీ ప్రాంతంలోనూ చతికిలబడిపోయింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలోనే టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలగా... ఏజెన్సీలోనూ అదే మాదిరి ఫలితాలే ఆ పార్టీకి లబించాయి. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో మొత్తం 186 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే... టీడీపీకి కేవలం 26 పంచాయతీలు మాత్రమే దక్కాయి. ఇక కమ్యూనిస్టులకు ఇక్క 16 పంచాయతీలు దక్కగా... ఇతరులకు 7 స్థానాలు దక్కాయి. మొత్తంగా మైదాన ప్రాంతాల్లో సత్తా చాటిన వైసీపీ.. ఏజెన్సీలోనూ తన పట్టు నిలుపుకుంది.