Begin typing your search above and press return to search.
ముస్లింలు వైసీపీకి దూరం అవుతున్నారా?
By: Tupaki Desk | 16 Sep 2020 11:30 AM GMTఏపీలో అధికారంలో ఉన్న జగన్ మెడ చుట్టూ పలు కేసులు ఉండడంతో ఆయన కేంద్రంతో సఖ్యతతో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే టాక్ ఒకటి రాజకీయాల్లో ఉంది. అందుకే కేంద్రం ఏ బిల్లు పెట్టినా ముందుగా వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. వాళ్లు అడిగినా.. అడగకపోయినా ముందుంటోంది. దీనివల్ల రాష్ట్రానికి వస్తున్న ప్రయోజనం ఏమీ ఉండడం లేదన్న చర్చ సాగుతోంది.. పైపెచ్చు కేంద్రం కూడా ఊదారంగా నిధులు ఇవ్వడం లేదంటున్నారు.. బీజేపీతో వైసీపీ స్నేహగీతం వల్ల ఏపీలోని ముస్లిం వర్గం మాత్రం ఆపార్టీకి దూరమవుతున్న పరిస్థితి ఉందని వైసీపీ ముస్లిం నేతల్లో చర్చ జరుగుతోంది.
2014 ఎన్నికల్లో వైసీపీకి దాదాపు 75శాతం ముస్లింలు ఓట్లు వేశారని తేలింది. 2019 ఎన్నికల్లో అది కాస్తా ఇంకా పెరిగి దాదాపు 80శాతం ముస్లింల ఓట్లు వైసీపీకే పడ్డాయని సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పటి నుంచి ఆయన కుటుంబానికి ముస్లింల ఓట్లు గంపగుత్తగా పడుతున్నాయి. అలాంటి ఓట్లు ఇప్పుడు మెల్లగా చీలిపోతున్నాయని టాక్ వినిపిస్తోంది.
చంద్రబాబును దూరం చేయాలని కాకుండా కేంద్రంతో సఖ్యత కోసం వైసీపీ పాటుపడుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి దగ్గర అవుతోంది. బీజేపీ హిందుత్వ పార్టీ అని ముస్లింలు దూరం అవుతున్నారని తెలిసినా ఈ సాహసం చేస్తోంది. ఎందుకంటే ప్రతీసారి కేంద్రంలో బిల్లులకు వైసీపీ ఎలాంటి కండీషన్లు పెట్టకుండా బీజేపీకి సపోర్టు చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు.. నిధులు అడగకుండానే మద్దతు ఇస్తోంది. ఇలా ఏకపక్షంగా సపోర్టు చేస్తే ముస్లింలు కూడా తమ దారి తాము చూసుకుంటారని.. వైసీపీకి దూరం అవుతారని వైసీపీ ముస్లిం పెద్దలు అంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రయోజనాలు అడిగి బీజేపీకి సపోర్టు చేస్తే.. ప్రయోజనాలు వస్తున్నాయని ఎన్నికల్లో ముస్లింలకు నచ్చజెప్పవచ్చు అని అంటున్నారు.
అది ఏమీ లేకుండా వాళ్లు అడిగినా.. అడగకపోయినా వైసీపీ ముందే సపోర్టు ప్రకటిస్తే వైసీపీలో ఉన్న ముస్లింలు ఇది సొంత వ్యవహారం అనుకునే పరిస్థితి వస్తుందని వైసీపీ ముస్లిం పెద్దలు భావిస్తున్నారు. అందుకని బీజేపికి మద్దతు ఇవ్వాల్సి వస్తే ముస్లిం పెద్దలను సంప్రదించి చేస్తే బాగుంటుందని ఒక మంచి మెసేజ్ ఆ వర్గానికి వెళుతుందని ఆ వర్గం వారు వైసీపీ సర్కార్ కు సూచిస్తున్నారు.