Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను అడ్డగింత.. పరిస్థితి ఉద్రిక్తం

By:  Tupaki Desk   |   6 March 2020 10:30 AM GMT
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను అడ్డగింత.. పరిస్థితి ఉద్రిక్తం
X
ఇసుక విధానంపై ఇప్పటికే సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ ఇసుక రీచ్ ఏర్పాటు కోసం పరిశీలనకు వెళ్లిన చిత్తూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. ఇసుక రీచ్ ప్రారంభించవద్దని కోరుతూ ఆ ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ ఘటన చిత్తూరు నియోజకవర్గం ఆనగల్లులో గురువారం చోటుచేసుకుంది. చిత్తూరు ఎమ్మెల్యే ఇసుక రీచ్‌ను ఆరణి శ్రీనివాసులకు ఈ పరిణామం ఎదురైంది.

ఆనగల్లు ఏర్పాటుచేసిన ఇసుక రీచ్ ను ప్రారంభించడానికి గురువారం ఎమ్మెల్యే శ్రీనివాసులు వచ్చారు. ఆయన రాకను పసిగట్టిన గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడ ఇసుక రీచ్‌ను పెట్టడానికి తాము అంగీకరించమని స్పష్టం చేశారు. నదిలో ఇసుక తీసేస్తే భూగర్భజలాలు అడుగంటిపోయి తమ గ్రామానికి తాగునీరు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం నమ్మి జీవిస్తున్న తమకు ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తే అన్యాయం అవుతుందని వాపోయారు. శ్మశానవాటికకు ఆనుకుని రీచ్‌ను ఏర్పాటు చేసి సమాధులను కూడా వదలకుండా తవ్వేస్తున్నారని, కళేబరాలు బయటపడుతున్నాయని తెలిపారు.

రీచ్‌ ఏర్పాటుచేస్తే గ్రామం మధ్యలో నుంచి ట్రాక్టర్లు రాకపోకలు సాగిస్తే రోడ్లు దెబ్బ తింటాయని, తమకు ఇబ్బంది అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రీచ్‌ ఏర్పాటుతో కొందరికి లాభం తప్ప తమకు తీవ్ర నష్టమని చెబుతూ ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో గ్రామస్తులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. మహిళలు పూజా సామగ్రిని ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండానే నిరసనల మధ్యే ఎమ్మెల్యే ఇసుక రీచ్‌ను ప్రారంభించి వెళ్లిపోయారు.