Begin typing your search above and press return to search.
ఎత్తుకొచ్చి ఓటేయించండి - యాంగ్రీ యెడ్డీ
By: Tupaki Desk | 6 May 2018 4:31 AM GMTరెండు ప్రధాన జాతీయ పార్టీల ప్రతిష్ఠకు.. ఓ ప్రాంతీయ పార్టీ ఉనికికి అత్యంత కీలకంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పోరు తుది ఘట్టానికి చేరింది. మే 12న జరగబోయే పోలింగ్‌కు ఆరురోజులు మాత్రమే మిగిలి ఉండటంతో కీలక పక్షాలైన కాంగ్రెస్ - బీజేపీ - జేడీఎస్ పార్టీల అగ్రనేతలు ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ తరఫున స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ రంగంలోకి దిగగా.. కాంగ్రెస్ తరఫున పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - సీఎం సిద్దరామయ్య కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ప్రాంతీయ పార్టీ జేడీఎస్ తరఫున మాజీ ప్రధాని దేవెగౌడ - ఆయన తనయుడు కుమారస్వామి పార్టీ విజయం కోసం శ్రమిస్తున్నారు. ప్రచారతీరెలా ఉన్నా మొత్తం మీద పలు కీలకాంశాలు ఫలితాలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఈ హాట్ హాట్ సమయంలోనే కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన బెళగావి సభలో మాట్లాడుతూ ఓటు వేయడానికి నిరాకరించే ఓటర్ల కాళ్లు - చేతులు కట్టి పోలింగ్ బూత్ లకు తీసుకొచ్చి బీజేపీకి ఓటువేయించాలని కార్యకర్తలకు సూచించారు. ``కార్యకర్తల్లారా.. మనకు విశ్రాంతి లేదు. ఎవరైన ఓటర్లు ఓటు వేయడానికి నిరాకరిస్తూ, పోలింగ్ బూత్‌కు రావడం లేదని మీ దృష్టికి వస్తే వారింటికి వెళ్లి - కాళ్లు - చేతులను కట్టేసి పోలింగ్ బూత్ కు తీసుకురండి. బీజేపీకి ఓటు వేయించండి`` అని అన్నారు. `నేను సీఎం కావడం ఖాయం. ఎవరూ అడ్డుకోలేరు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే కర్ణాటకలోనూ పునరావృతమవుతాయి` అని చెప్పారు. కాగా, యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా స్పందిస్తూ `బీజేపీ ఓటమి భయంతో ఏం చెయ్యాలో అర్థంగాక బెదిరింపులకు దిగింది. ఏకంగా ఓటర్లనే బెదిరిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఈ చర్య సిగ్గుచేటు`అని ట్వీట్ చేశారు.
ఇదిలాఉండగా...గనుల తవ్వకాల కేసుల్లో కీలక నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి సోదరులు మళ్లీ బీజేపీ తరఫున ఎన్నికల గోదాలోకి దిగడం ఆ పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. బళ్లారిలో 10 నుంచి 15 సీట్లలో బీజేపీకి లాభం కలిగినా మొత్తం మీద ఇది బీజేపీకి నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ 40 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తే బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటుందని.. 40 కంటే తక్కువ స్థానాలు వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. టీవీ చర్చల్లో, మీడియాలో ఎక్కడా కనిపించకపోయినప్పటికీ దళితులు, ముస్లిం ఓట్ల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయరాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఘటనలు అంతర్లీనంగా బీజేపీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.