Begin typing your search above and press return to search.
కర్ణాటక బీజేపీ.. తేనెతుట్టెగా మారిందా!
By: Tupaki Desk | 14 Aug 2019 5:47 PM GMTకర్ణాటకలో ఎలాగోలా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు కానీ, ఎంతకూ కేబినెట్ ను అయితే ఏర్పాటు చేయలేకపోతున్నారు కమలనాథులు. కాంగ్రెస్-జేడీఎస్ ల ప్రభుత్వాన్ని దించేశారు. కుమారస్వామిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపారు. వెంటనే యడియూరప్ప అందులో ఆశీనులు అయ్యారు. అయితే ఇప్పటికీ అక్కడ మైనారిటీ సర్కారే ఉంది.
అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒకటి తేలి, ఉప ఎన్నికలు జరిగి మొత్తం బలాబలాలు తేలితే కానీ అసలు కథ అర్థం కాదు. ఉప ఎన్నికలు జరిగితే కాని ఎవరి బలం ఎంతో స్పష్టత రాదు. అదలా ఉంటే..ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు గడిచిపోయినా ఇంకా ఇంత వరకూ కేబినెట్ ఊసు లేదు.
యడియూరప్ప తన కేబినెట్ ఏర్పాటు చేయలేకపోతూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం.. ఎవరికి బెర్తులు ఇవ్వాలనేది తేల్చుకోలేకపోవడమే అని తెలుస్తోంది. మంత్రి పదవుల విషయంలో చాలా మంది ఆశావహులున్నారు. వారిలో ఒకరికి స్థానమిచ్చి మరొకరికి అవకాశం ఇవ్వకపోతే అంతే సంగతులు.
అసంతృప్తులు గ్రూపులుగా తయారవుతారు. అప్పుడు కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు పడిన ఇబ్బందులే బీజేపీకి కూడా తప్పవు. స్పష్టమైన మెజారిటీ ఉంటే.. గ్రూపులను డీల్ చేయడం ఈజీ అవుతుంది. ఉన్నది బోటాబోటీ మెజారిటీ. ఉప ఎన్నికలు జరిగితే కథ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి.. ఇప్పుడు కేబినెట్ ను ఏర్పాటు చేయడం బీజేపీకి అంత తేలికైన విషయం కాదని పరిశీలకులు అంటున్నారు.
అందుకే ఎటూ తేల్చలేక మూడో వారంలో కూడా కేబినెట్ ఏర్పాటుకు రెడీ అనలేకపోతూ ఉన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్, జేడీఎస్ లు వాడుకుంటున్నాయి. 'ఇప్పటి వరకూ కేబినెట్ ఏర్పాటు కాలేదు, రాష్ట్రంలో వరదల ఉదృతి గట్టిగా ఉంది, ముఖ్యమంత్రి కూర్చుంటే చాలా? మంత్రులు వద్దా?' అంటూ ఆ పార్టీ వాళ్లు ధ్వజమెత్తుతూ ఉన్నారు. అయితే బీజేపీ వాళ్లు మాత్రం కేబినెట్ ఏర్పాటు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.