Begin typing your search above and press return to search.
అద్వానీపై యడ్యూరప్ప ఎదురుదాడి
By: Tupaki Desk | 13 Nov 2015 7:06 AM GMTబీహార్ ఎన్నికల ఫలితాలు బీజేపీలో చిచ్చుపెట్టాయి. పార్టీ సీనియర్లంతా ఈ విషయంపై మండిపడుతున్నారు. ఆ పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ నేతృత్వంలోని బృందం నిరసన గళం గట్టిగా వినిపిస్తోంది. ఈ బృందం బీజేపీ అగ్ర నేతలయిన మోడీ-అమిత్ లను టార్గెట్‌గా చేసుకుని విమర్శిస్తున్నా నేరుగా ఆయనపై ఎదురు దాడి చేసేందుకు బీజేపీ నేతలెవరూ సిద్ధంగా లేరు. కానీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రం నేరుగా అద్వానీ నే టార్గెట్ చేశారు. ఆయనపై ఎదురుదాడికి దిగారు. తీవ్రంగా విమర్శించారు.
నరేంద్రమోడీ ప్రధాని కావడాన్ని సహించలేకే బీజేపీ సీనియర్ నేత అద్వానీ తో పాటు మరికొంత మంది నేతలు ఆయనపై విమర్శలకు దిగుతున్నారని యడ్యూరప్ప ఫైర్ అయ్యారు. ఆయన ఈ రోజు బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సారథ్యంలో ఇప్పటి వరకు బీజేపీ ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. అయితే అదే సమయంలో ఆ విజయాలన్నీ తమ కారణంగానే లభించాయని మోడీ - అమిత్ షా ఏనాడూ చెప్పుకోలేదని తెలిపారు. బీహార్ ఓటమికి కేవలం నరేంద్రమోడీ - అమిత్ షాలను మాత్రమే బాధ్యులను చేయడం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ ఓటమి నుంచి బీజేపీలోని వారందరూ పాఠాలు నేర్చుకోవాలని పేర్కొన్నారు.
ఇక అద్వానీ వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని ఆయన పంచ్‌లు విసిరారు. పార్టీ వైఖరికి సంబంధించి ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని నాలుగ్గోడల మధ్య చర్చించుకుని, పరిష్కరించుకోవాలి తప్ప ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని హితవు పలికారు. బీజేపీలో ఇటీవలి కాలంలో అద్వానీ పై ఇంతనేరుగా విమర్శించిన నేత ఈయనే కావడం విశేషం. ఏడాది కాలంలో పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, బీహార్‌లో ఓటమికి ఇదే ప్రధాన కారణమని అద్వానీ బృందం ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల ఫలితాల నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని, బీహార్ ఓటమితో ఈ విషయం స్పష్టమైందని, ఓటమికి సమష్టి బాధ్యత అంటూ తప్పించుకోలేరని అద్వాని బృందం ఒక ప్రకటన జారీచేసింది. అందులో అందరూ బాధ్యులే అని చెప్పడమంటే.. ఎవరినీ బాధ్యులను చేయకుండా జాగ్రత్త పడటమేనని మోడీతో పాటు ఆయన వర్గాన్ని విమర్శించిన విషయం తెలిసిందే.
బీహార్ ఎన్నికల తర్వాత అద్వాని వర్గం మోడీ వర్గం విమర్శలు చేసినా వారు మాత్రం దీనిపై పోస్టుమార్టం చేసుకోకపోవడం గమనార్హం. ఇక యడ్యూరప్ప వ్యాఖ్యలు ఆయనే సొంతంగా చేశారా లేదా ఆయన వెనక ఎవరైనా ఉన్నారా ...అసలు మోడీ వర్సెస్ అద్వాని వర్గం వార్ బీజేపీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.