Begin typing your search above and press return to search.
గుమస్తా నుంచి కర్ణాటక 23వ సీఎంగా..యడ్యూరప్ప
By: Tupaki Desk | 17 May 2018 6:49 AM GMTఒక సాంఘీక సంక్షేమ శాఖలో సాధారణ గుమస్తా గా పనిచేసిన యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ఎలా ఎన్నికయ్యారు. అందరి అంచనాలను తలకిందు చేస్తూ సీఎం పీఠం ఎలా అధిరోహించారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదివిన యడ్యూరప్ప కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వారు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు సీఎం పీఠం అధిరోహించే వరకూ సాగింది. ఈ నేపథ్యంలో ఎన్నో అవమానాలు -ఎన్నో కుట్రలు.. ఎన్నో ఆరోపణలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఇవన్నీ దాటి కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ఎలా ఎదిగారో తెలుసుకుందాం..
*యడ్యూరప్ప బాల్యం - విద్యాభ్యాసం
వివాదాలకు కేంద్ర బిందువు అయిన బీఎస్. యడ్యూరప్ప 1943 ఫిబ్రవరి 27న కర్ణాటకలోని మాండ్య జిల్లా బూకనాకెరెలో జన్మించాడు. సిద్దిలింగప్ప, పుట్టథాయమ్మ తల్లిదండ్రులు. చదువులు పూర్తయ్యాక క్లర్క్ గా సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం చేసి అది నచ్చక వదిలేశాడు. 1970లోని శికారిపుర శాఖకు ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా నియమించబడ్డారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు బీజేపీ తరఫున పోరాడి జైలుకు కూడా వెళ్లాడు. 1983లో శికారిపుర ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు. 1988లో కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎదిగారు. 2007 నవంబర్ లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినా నాటి జేడీఎస్ మద్దతు ఉపసంహరించడంతో సీఎం పదవి కోల్పోయారు. అనంతరం మరోసారి జరిగిన ఎన్నికల్లో 2008 మే 30న మరోసారి రెండోసారి కర్ణాటక సీఎం అయ్యారు.
*యడ్డీపై ఆరోపణలెన్నో..
యడ్యూరప్పకు లింగాయత్ సామాజికవర్గంలో మంచి పేరుంది. మంచి మాటకారి అయిన యడ్యూరప్ప స్పీచ్ లకు జనం బాగా ఆకర్షితులవుతున్నారు. మోడీని మించి కన్నడలో పాపులారిటీ ఉంది. కానీ 2011లో యడ్యూరప్పపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన కుమారులు, కుటుంబానికి కూడా మైనింగ్ అక్రమాల్లో చిక్కుకుపోయారు. దీనిపై సీబీఐ కేసు నడిచింది. భూ కుంభకోణాలపై యడ్యూరప్పపై వారెంట్ కూడా జారీ అయ్యింది. వారంపాటు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. కానీ ఆ తర్వాత 2016లో సీబీఐ కేసుల నుంచి యడ్యూరప్ప క్లీన్ చీట్ పొందారు. 40 కోట్ల మైనింగ్ అక్రమాల కేసు నుంచి విముక్తి కలిగింది. దీంతో 2011లో మరోసారి సీఎం రేసులో నిలిచారు..
*ఆరోపణలొచ్చినా మోడీ నమ్మాడు..
యడ్యూరప్పపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చినా ప్రధాని మోడీ - బీజేపీ యడ్యూరప్పను నమ్మారు. ఆయనకు లింగాయత్, ఇతర సామాజికవర్గాల్లో ఉన్న పాపులారిటీతో విమర్శలను పక్కనపెట్టింది. అవినీతిపరుడైనా కూడా సీఎం అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో బరిలోకి దింపి బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. ఇలా వివాదాల యడ్యూరప్ప.. మోడీ, బీజేపీ దయతో కర్ణాటక సీఎంగా అయ్యారు. గుమస్తా నుంచి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎదిగారు..