Begin typing your search above and press return to search.
వేటుతో యడ్డీకి లాభం.. గట్టెక్కినట్టే.!
By: Tupaki Desk | 29 July 2019 5:11 AM GMT14మంది రెబెల్స్ ఎమ్మెల్యేలపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. నాలుగేళ్ల దాకా వాళ్లు పోటీచేయకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర పన్నిన ఎమ్మెల్యేలకు తీవ్ర షాక్ తగిలింది. అయితే ఈ వేటు బీజేపీకి ఆయాచిత వరంగా మారింది.
ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు స్పీకర్ ఒక్కరే కాంగ్రెస్-జేడీఎస్ ల పక్షాన కీలకంగా ఉన్నారు. ఆయనతో బీజేపీని చెడుగుడు ఆడేస్తున్నారు. రెబల్స్ పై కూడా ప్రతాపం చూపించారు. అధికారం కోల్పోయిన కాంగ్రెస్-జేడీఎస్ లు ఇప్పుడు స్పీకర్ చేత రెబల్స్ పై అనర్హత వేటు వేయించి చుక్కలు చూపించారు. అయితే రెబెల్స్ పై వేటు ఆ ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా నష్టం కాగా.. బీజేపీకి మాత్రం వరంగా మారింది.
రెబల్స్ పై నాలుగేళ్ల అనర్హతతో వారు ఉప ఎన్నికల్లో పోటీచేయకుండా పోయారు. ఇక కాంగ్రెస్-జేడీఎస్ పక్షాన రెబల్స్ పై వేటుతో 99మంది మాత్రమే మిగిలారు. ఇక రెబల్స్ పోనూ బీజేపీకి 105మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్షలో ప్రస్తుతం మేజిక్ మార్క్ 103కు పడిపోయింది. దీంతో రెబల్స్ పై వేటుతో బీజేపీకే రెండు సీట్లు ఎక్కువ బలం ఉంది.
ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం జరిగే బలపరీక్షలో యడ్యూరప్పకు తిరుగులేనట్టే. దీంతో ప్రస్తుతానికి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం ఖాయమే. ఇక అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టు తలుపు తడుతున్నారు. తమపై నాలుగేళ్ల వేటు పడడంపై వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.