Begin typing your search above and press return to search.
ఒకేఒక్కడులో అర్జున్...ఈ సీఎంలు ఒక్కటే
By: Tupaki Desk | 19 May 2018 1:34 PM GMTదాదాపు `17 ఏళ్ల కిందట వచ్చిన 'ఒకే ఒక్కడు' సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన అర్జున్ ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేసే పాత్ర పోషించారు. అప్పట్లో ఆ పాత్ర బాగా పాపులర్ అయింది. అలా నిజజీవితంలో కూడా రాజకీయ సంక్షోభం కారణంగా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అదే సందర్భం తెరమీదకు వచ్చింది. అనుక్షణం.. ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాల మధ్య సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ శాసనసభాపక్ష నేత, కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప కేవలం రెండు రోజులే సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం విశ్వాస పరీక్షకు ముందు సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
భారతదేశ చరిత్రలో గతంలో రాష్ర్టాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు,మెజారిటీ లేకపోవడం, విశ్వాస పరీక్షలో పరాజయం పాలవడం తదితర కారణాలతో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు తప్పని పరిస్థితుల్లో రాజీనామాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలా తక్కువ రోజుల పాటు అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రుల జాబితా ఇది.
హరీశ్ రావత్ : ఒక్క రోజు సీఎం..
ఉత్తరాఖండ్ (ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 22 - 2016)
జగదాంబికా పాల్ : 2 రోజులు
ఉత్తర్‌ప్రదేశ్ (ఫిబ్రవరి 21 నుంచి 23 - 1998)
యడ్యూరప్ప : 2 రోజులు
కర్ణాటక (మే 17 నుంచి 19 - 2018)
ఓపీ చౌతలా: 5 రోజులు
హరియాణా(జులై 12 నుంచి 17 - 1990)
సతీశ్ ప్రసాద్ సింగ్: 9 రోజులు
బిహార్ (జనవరి 27 నుంచి ఫిబ్రవరి 5 - 1968)
ఎస్.సీ మరాక్: 11 రోజులు
మేఘాలయ (ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 - 1998)
జానకీ రామచంద్రన్: 23 రోజులు
తమిళనాడు (జనవరి 7 నుంచి 30 - 1988)
బీపీ మండల్: 26 రోజులు
బిహార్ (ఫిబ్రవరి 5 నుంచి మార్చి 2 - 1968)
సీహెచ్ మొహమ్మద్ కోయ: 49 రోజులు
కేరళ (అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 1 - 1979)