Begin typing your search above and press return to search.

తిమ్మిని బమ్మి..'పచ్చ' మీడియా పిచ్చిరాతలు

By:  Tupaki Desk   |   26 Oct 2018 5:46 AM GMT
తిమ్మిని బమ్మి..పచ్చ మీడియా పిచ్చిరాతలు
X
అసలు బుద్దున్నోడు ఎవడైనా ఇలా రాస్తాడా.? ఆ పచ్చకామెర్లాధిపతిని రక్షించడానికి కలానికి పసుపు రంగు పూసుకుంటారా.? పైన పసుపు.. కింద పసుపు.. నెపాన్ని తగ్గించేలా.. ప్రతిపక్షనేతపై హత్యాయత్నాన్నే తగ్గించేలా.. అభిమానం ముసుగులో అవాస్తవాలను కప్పేసిన ఆంధ్ర పచ్చమీడియా పిచ్చి రాతలు చూసి జనం అవాక్కవుతున్నారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా.? అధికారంలో ఉన్నవాళ్లను కాపాడడానికి ఇంతకు దిగజారుతారా అని ముక్కునవేలేసుకుంటున్నారు..

సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక.. ఏదీ నిజమో ఏదీ అబద్దమో తెలియడం లేదు. వైఎస్ జగన్ పై దాడి చేసిన వ్యక్తిని వైసీపీ అభిమానిగానే పచ్చమీడియా ప్రచారం చేసింది. టీడీపీ వ్యక్తిగా చేస్తే నెపం బాబు మెడకు చుట్టుకుంటుందనో ఏమో ఇలా రాసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. . అందుకే జాగ్రత్తగా నిందితుడి ఫొటోను జగన్ ఫొటోను మిక్స్ చేసి బాగానే సోషల్ మీడియాలో వదిలేశారు. ఆ మార్ఫింగ్ ఫొటోలను ఏకంగా పచ్చమీడియా మొదటి పేజీలో అచ్చేసి.. ‘బాబు సక్కనోడు.. ఏం పాపం తెలియదంటూ’ తేల్చేశారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలు.. సోషల్ మీడియా అవాస్తవాల రాతలను ఏర్చి కూర్చి జగన్ పై హత్యాయత్నాన్ని టీడీపీపై పడకుండా వైసీపీపైనే నెట్టేయడంలో పచ్చ మీడియా ఈరోజు చేసిన ప్రయత్నం చూసి అందరూ అవాక్కవుతున్నారు..

బాబు పై ఈ పచ్చమీడియాకు ప్రేమ ఇప్పటిదీ కాదు.. గడిచిన ఎన్టీఆర్ హయాం నుంచే తెలుగుదేశం సైకిల్ కు ఈ కమ్మ మీడియా కాపు కాస్తోంది. అడకత్తెరలో పడ్డప్పుడల్లా పచ్చాధినేతలను రక్షిస్తూ ప్రజల కళ్లకు గంతలు కడుతోంది. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది కూడా..

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వార్తలను తొక్కేశారు. ఆయన వాయిస్ ను వినిపించకుండా చేశారు. చంద్రబాబు అనుకూల ఆ రెండు పత్రికలు.. మీడియా బాబు దేవుడంటూ ప్రచారం చేసినా ప్రజలు ఆ అరాచక పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ ను ఉమ్మడి ఏపీలో గద్దెనెక్కించారు. ఆ తర్వాత ప్రజాసంక్షేమ పాలనతో వైఎస్ ఏలారు.

ఇక 2014 ఎన్నికల్లో జగన్ ను గెలుపువాకిట పచ్చ మీడియా పిచ్చి కూతలతో వెనక్కినెట్టింది. రాష్ట్రం అన్యాయమైపోతుందని .. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకొన్న టీడీపీని గెలిపించకపోతే రాష్ట్రం అన్యాయమైపోతుందని తప్పుడు కథనాలు ప్రచారం చేశారు. పవన్ - మోడీ - టీడీపీ కూటమితో అవిభాజ్య ఏపీని అన్యాయం కాకుండా కాపాడుతామని నమ్మించారు. దీంతో వైసీపీ గెలిచే చోట టీడీపీ గెలిచింది. ఆ టీడీపీ నాలుగున్నరేళ్ల పాలన తర్వాత ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ ప్రజలకు చేరువయ్యాడు. ఈ సారి విజయం ముంగిట నిలుచున్నారు. ఇప్పుడూ అదే పాత వ్యూహాలు.

జగన్ ను సీఎం కాకుండా చేయాలి.. ఎలా చేయాలి.? ఏం చేయాలి.? పాదయాత్రను ప్రజల ముద్రలోంచి చెరిపివేయాలి. అందుకే ఈ డ్రామాలు. హత్యాయత్నాలు జరిగినా అభాసుపాళ్లు. ప్రతిపక్షం లేకుండా చేయాలనో.. లేక ప్రతీపక్ష నేతనే లేకుండా చేయాలనో.. కుట్ర అయితే జరిగింది. ఆ నిందితుడికి, ఆ దేవుడికి.. ఆ అధికార అధినేతకే తెలుసు.. వాస్తవం ఏమిటో.. కానీ వారు ముగ్గురు చెప్పరు. ఆ అధిపతి చెప్పిందే అందరికీ అదేశాలట.. ప్రాణాలు పోయే సంఘటన జరిగినా తమ మీదకు రాకుండా పచ్చమీడియాతో కట్టుకథలు అల్లిన వైనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎంతటి బలమైన లాబీయింగ్ ఉందో తేటతెల్లం చేస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ కు దడ పుట్టించేలా చేస్తున్న పచ్చ బ్యాచ్ రాజకీయాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఏదీ జరిగినా.. ఎంత చేసినా కాపాడడానికున్న ‘పచ్చ’ మీడియా బాబుకు రక్షణ కవచంలా ఉంది. మరి ఇందులో వాస్తవాలు ప్రజలకు ఎలా తెలుస్తాయి. ? ఎవరూ ఆ పిల్లి మెడలో గంటకట్టేది.? ఎప్పటికీ నీతి నిజాయితీ బయటకొస్తుంది.. ఎడారిలో ఒయాసిస్సులా ఏపీలో నిజాలను వెతికే పరిస్థితి కనిపిస్తోంది. . ఇలా ఎంతకాలం.?