Begin typing your search above and press return to search.

'జగన్ వస్తే..' టీడీపీ మీడియాకు ఇదే చర్చ!

By:  Tupaki Desk   |   9 May 2019 11:44 AM GMT
జగన్ వస్తే.. టీడీపీ మీడియాకు ఇదే చర్చ!
X
ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తమ పార్టీ గెలవబోతోదంటూ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనేక విషయాలను ప్రస్తావిస్తూ మళ్లీ గెలిచేది తమ పార్టీనే అంటూ హడావుడి చేస్తూ ఉన్నారు. బాబు చెప్పే రీజన్లు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి కూడా! గతంలో ఏ రీజన్లను ప్రస్తావించి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారో, ఇప్పుడు అవే రీజన్లను చెబుతూ తమ పార్టీ గెలవబోతోందని బాబు అంటున్నారు. దీంతో వినే వాళ్లకు ఇదో ప్రహసనంగా మారుతోంది కూడా. తొలి విడత పోలింగ్ తమను దెబ్బతీసే కుట్ర అని పోలింగ్ కు ముందు చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే చంద్రబాబు నాయుడు ఏపీలో తొలి విడతలోనే పోలింగ్ ను నిర్వహించడం ఏమిటంటూ ధ్వజమెత్తారు. అదంతా మోడీ కుట్ర అని అప్పట్లో బాబు వాపోయారు. ఏపీలో ఆఖరి విడతల్లో పోలింగ్ జరగాల్సిందంటూ బాబు విరుచుకుపడ్డారు.

అయితే ఇటీవల ఒక సమీక్షలో బాబు మాట్లాడుతూ.. తొలి విడతలో పోలింగ్ జరగడం తమకు మేలు చేసిందని చెప్పుకొచ్చారు. ఇలా బాబు పరస్పరం విరుద్ధమైన భావనలతో మాట్లాడుతూ ఉండటం విడ్డూరంగా మారింది.

ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియాలో కొత్త చర్చ మొదలైంది. 'జగన్ సీఎంగా వస్తే..' అనే అంశం మీద తెలుగుదేశం అనుకూల మీడియా విశ్లేషణలు మొదలుపెట్టడం విశేషం.

తెలుగుదేశం పార్టీకి బాగా జాకీలు వేసే ఒక మీడియా సంస్థ 'జగన్ వస్తే..' అనే టాపిక్ మీద చర్చ పెడుతూ ఉంది. 'జగన్ వస్తే రాజధాని మారిపోతుంది.. దొనకొండకు మారిపోతుంది..'అంటూ ఆ మీడియా అప్పుడే మొదలుపెట్టింది.

ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజధానిని మార్చే ప్రసక్తి లేదని చెప్పారు. అయినా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాత్రం.. 'జగన్ వస్తే రాజధాని మారుతుంది..' అంటూ మొదలుపెట్టింది. ఇంకా ఫలితాలు రాకముందే 'జగన్ వస్తే..' అనే ఫీలింగ్ తో తెలుగుదేశం అనుకూల మీడియా కథనాలు రాయడం ఒక విశేషం అయితే, జగన్ స్పష్టత ఇచ్చినప్పటికీ అందుకు విరుద్ధంగానే ఆ మీడియా వర్గాలు విశ్లేషణలు వినిపిస్తుండటం మరో పాయింట్!