Begin typing your search above and press return to search.
ప్రజలు తిరస్కరించినా.. తీరు మారని పచ్చ మీడియా!
By: Tupaki Desk | 10 July 2019 2:30 PM GMTరాష్ట్రంలో మెజారిటీ మీడియా ఒక వర్గం - ఒక సామాజికవర్గం చేతిలో చిక్కుబడిపోయి నాణేనికి ఒకే వైపు పరిణామాలను చూపిస్తూ ఉండటం కొత్త ఏమీ కాదు. దశాబ్దాలుగా జరుగుతున్న తంతే ఇది. మీడియాకు ప్రజా ప్రయోజనాలు - విలువలు ఏమీ అక్కర్లేదు. ఎంతసేపూ తాము - తమవారి ప్రయోజనాల కోసం మాత్రమే మెజారిటీ మీడియా వర్గాలు వార్తలు ఇస్తూ ఉంటాయి.
అటు అవే వార్తలను అమ్ముకుంటూ క్యాష్ చేసుకోవడం - వాటి ద్వారానే తమ కుల ప్రయోజనాలను కాపాడుకోవడం..ఇదీ తెలుగునాట మీడియా నీతి! ఇదే నీతిని పలు సార్లు ప్రజలు కూడా ఎండగట్టారు. ఆ మీడియాను - ఆ మీడియా వెనుక ఉన్న వ్యక్తులను ప్రజలు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టుగా.. తెలుఉగు మీడియా తన తీరును కొనసాగిస్తూ ఉంది.
అందుకు ఉదాహరణ మైహోం గ్రూప్ పై జరిగిన ఐటీ దాడులను వక్రీకరించే ప్రయత్నం. తెలంగాణ సీఎం కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మై హోం గ్రూప్ పై ఐటీ రైడ్స్ జరిగాయనే కోణాన్ని తెలుగు మీడియా అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం.
అలాంటి వార్తలను ఇవ్వకపోగా.. అక్రమాలు అంటూ అడ్డగోలు వార్తలను కూడా ఇస్తూ ఉన్నాయి కొన్ని మీడియా వర్గాలు. ప్రత్యేకించి సోషల్ మీడియా ముసుగు వేసి ఆ వార్తలను వండి వారుస్తూ ఉన్నారు.
ఇదే సందర్భంలో ఇటీవల సుజనా చౌదరి సంస్థలపై జరిగిన ఐటీ - ఈడీ రైడ్స్ ను గుర్తు చేయాలి. అప్పుడు పచ్చ మీడియావర్గాలు ఎలా గగ్గోలు పెట్టాయో అందరికీ తెలిసిందే.
చౌదరి అక్రమాలపై కేసులు నమోదు అయ్యాయి ముందుగా. వాటిపై చాలా లేట్ గా విచారణలు - తనిఖీలు జరిగాయి. అయితే అవంతా కక్ష సాధింపు చర్యలు అని - మోడీ కుట్రలు అని ప్రచారం చేశారు. అలా సానుభూతి ప్రయత్నం చేశారు. చివరకు అదే చౌదరి తెలుగుదేశాన్ని వీడి బీజేపీలోకి చేరిపోయాడు.
అప్పుడేమో అలా గగ్గోలు పెట్టారు. అయితే ఇప్పుడు మై హోంపై జరిగిన రైడ్స్ ను మాత్రం వక్రీకరించే ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలను తప్పి పెట్టి ఏదో అక్రమాలు జరిగిపోయినట్టుగా పచ్చ మీడియానే ప్రచారం చేస్తోంది. ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలు వీళ్లను మళ్లీ లేవలేని స్థాయికి చితకొట్టినా తీరు మాత్రం మారకపోవడం గమనార్హం.