Begin typing your search above and press return to search.
బాబు అవినీతిని దాచేందుకు రంగంలోకి దిగిన ఎల్లోమీడియా!
By: Tupaki Desk | 13 Jan 2020 1:30 AM GMTజగన్ ప్రభుత్వంపై పచ్చ మీడియా బురద జల్లుతోందని.. అందులో భాగంగానే అసత్య ప్రచారాలు చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికలు, ఛానల్స్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నాయని బొత్స విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎల్లో మీడియా అవాస్తవాలు రాస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తందున్న ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎన్నికల మేనిఫెస్టోను నిక్కచ్చిగా అమలు చేస్తున్న ఘటన సీఎం జగన్‌దేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. అమ్మ ఒడి కింద రూ.6,400 కోట్లు విడుదల చేశారన్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు. అమరావతిలో చేసిన తప్పులు, అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి ఇప్పుడు నానా తిప్పలు పడుతూ నాటకాలు ఆడుతున్నారన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చంద్రబాబు కారణమని.. చంద్రబాబు చేసిన తప్పులను జగన్ సరిదిద్దుతున్నారని అన్నారు. చంద్రబాబు తన బినామీ ఆస్తులు కాపాడుకునేందుకు అమరావతి ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ లోని 13 జిల్లాల అభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏపీకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను దిగ్విజయంగా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.