Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ప్రజలకు ఎల్లో వార్నింగ్ వచ్చేసింది.. జర జాగ్రత్త
By: Tupaki Desk | 21 Dec 2022 8:30 AM GMTచలికాలం చలిగా ఉండటం మామూలే. కానీ.. రోటీన్ కు భిన్నంగా తీవ్రత ఎక్కువగా ఉండే చలి గడిచిన మూడు రోజులుగా తెలుగు ప్రజలు చూస్తున్నారు. అందునా తెలంగాణ ప్రాంతంలో చలి పులి పంజా విసురుతోంది. దీంతో.. ప్రజలు వణికిపోయే పరిస్థితి. ఇటీవల కాలంలో ఏ సీజన్ కు ఆ సీజన్ లో తీవ్రత ఎక్కువగా చూస్తున్న పరిస్థితి. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం.. వర్షా కాలంలో వర్షాలు భారీగా పడటం తెలిసిందే.
ఇప్పుడు చలికాలం వచ్చేసింది. చలి తీవ్రత అంతకంతకూ ఎక్కువగా ఉంటోంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. రాత్రిపూట సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల చలి ఎక్కువగా ఉన్న పరిస్థితి.
గాలిలో తేమ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఈదురు గాలులు కూడా ఉండటంతో వణికిపోతున్న పరిస్థితి.తాజాగా వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం రానున్న మూడు రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఇందులో భాగంగా వారు ఎల్లో అలెర్టును జారీ చేశారు. దీంతో.. రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవటం కారణం చలి ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో వ్యాధులు వేగంగా ముసిరే అవకాశం ఉంది. దీనికి తోడు పెద్ద వయస్కులకు నరకం కనిపించే పరిస్థితి. ఇప్పటికే జలుబులు.. జ్వరాలు ఎక్కువగా ఉంటున్న వేళ.. కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి.
చలి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకునే వీలుంది. తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల కంటే కూడా హైదరాబాద్ మహానగర ప్రజలకు ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉందంటున్నారు. సో.. బీకేర్ ఫుల్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.