Begin typing your search above and press return to search.

యెల్లో వారియ‌ర్ : దుబాయ్ కి కావ‌లి గ్రీష్మ !

By:  Tupaki Desk   |   11 Jun 2022 7:32 AM GMT
యెల్లో వారియ‌ర్ : దుబాయ్ కి కావ‌లి గ్రీష్మ !
X
రాత్రికి రాత్రి ఇమేజ్ మారిపోవ‌డం అంటే ఇదే ! ఆమె చెప్పిన మాట చేసిన ప్ర‌సంగం.. అటుపై తొడ‌గొట్ట‌డం.. విప‌క్షాన్ని స‌వాలు చేయ‌డం ఇవ‌న్నీ కూడా ఆమెను రాత్రికి రాత్రే సెల‌బ్రిటీని చేశాయి.

ఇంకా చెప్పాలంటే ప‌సుపు పార్టీలో ఆమె స్థాయిని మ‌రియు స్థానాన్నీ పెంచాయి. ఆమే శ్రీ‌కాకుళం లీడ‌ర్ కావలి గ్రీష్మ. తాత జ‌స్టిస్ పున్న‌య్య, అమ్మ కావలి ప్ర‌తిభా భార‌తి.. ఆ వార‌స‌త్వంలో ఆ న‌డ‌వడిలో భాగంగా ఇటుగా అన‌గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 2014 నుంచి కాస్త యాక్టివ్ గా ఉన్నారు.

అప్ప‌ట్లో బ్రింగ్ బాబు బ్యాక్ శ్రీకాకుళం వింగ్ లో కాస్త యాక్టివ్ గానే ప‌ని చేశారు. త‌రువాత సీబీఎన్ ఆర్మీకి కూడా జిల్లా ఇంఛార్జ్ గా ఉన్నారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు క‌నుక ప్ర‌స్తుతం ఆమె ఐ టీడీపీ వింగ్ ఇంఛార్జ్ గా ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లాకు ప‌నిచేస్తున్నారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌న త‌రువాత ఆమె ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇంఛార్జ్ గా ఉంటూనే, ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లా ఐటీడీపీ వ‌ర్క్స్ ను మానిట‌ర్ చేస్తున్నారు.

తాజాగా దుబాయ్ మ‌హానాడు వేడుకల‌కు వెళ్తున్నారు. అతిథిగా వెళ్తున్నారు అని రాయాలి.ఆమెతో పాటు నాదెండ్ల బ్ర‌హ్మం (తెలుగు యువ‌త, స్టేట్ ప్రెసిడెంట్), పీత‌ల సుజాత (మాజీ మంత్రి), బండారు వంశీ కృష్ణ (అఫీషియ‌ల్ స్పోక్స్ ప‌ర్స‌న్ ) కూడా దుబాయ్ మ‌హానాడు వేడుక‌ల‌కు మ‌రియు ఎన్టీఆర్ శ‌త జ‌యంత్యుత్స‌వాల‌కు వెళ్తున్నారు.

ఇక ఎన్నిక‌ల విష‌యానికే వ‌స్తే... రానున్న కాలంలో రాజాం నుంచి పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నా ఇక్క‌డ ఆమెకు పోటీగా సీనియ‌ర్ లీడ‌ర్, మాజీ మంత్రి కోండ్రు ముర‌ళి ఉన్నారు. ఆయ‌న్ను దాటి రాజ‌కీయం చేయడం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌గ‌ని ప‌ని! క‌నుక ఈమెకు టికెట్ ఇస్తారో లేదో అన్న‌ది ఇప్ప‌టి నుంచే చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

కానీ మ‌హానాడు లో ఆమెకు వ‌చ్చిన ఇమేజ్ తో పాటు వైసీపీతో త‌రుచూ కయ్యాలు పెట్టుకుని, పోరాడుతున్న నైజం చూసి టికెట్ ఇస్తే ఇవ్వొచ్చు అన్న ఊహాగానం కూడా విన‌వ‌స్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ వ‌చ్చే ఎన్నిక‌లు కావలి కుటుంబానికి ఎంతో కీల‌కం కావొచ్చు.