Begin typing your search above and press return to search.
వైసీపీకి భయపడుతున్న ఎర్రన్నాయుడి భార్య
By: Tupaki Desk | 26 Feb 2019 4:01 PM GMTకేంద్ర మంత్రిగా - టీడీపీ కీలక నేతగా ఒక వెలుగు వెలిగిన దివంగత ఎర్రన్నాయుడి భార్య ఇప్పుడు వైసీపీని చూసి తెగ టెన్షన్ పడుతున్నారట. వైసీపీ గాలిలో తన కుమారుడు రామ్మోహననాయుడు ఎక్కడ ఓడిపోతారో అని ఆందోళన చెందుతున్నారట.
రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న వైసీపీ గాలి టీడీపీలోని బలమైన రాజకీయ కుటుంబాలను సైతం వణికిస్తోంది. ఆ క్రమంలోనే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడి తల్లి - దివంగత నేత ఎర్రన్నాయుడి భార్య తన కుమారుడి రాజకీయ భవిష్యత్ పై ఆందోళన చెందుతూ ఈసారి పార్లమెంటుకు కాకుండా శాసనసభ టిక్కెట్ కావాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరినట్లు సమాచారం.
మాజీ ఎంపీ కిల్లి కృపారాణి తాజాగా వైసీపీలోకి చేరడం.. ఆమెకు జిల్లాలోని ఇతర వైసీపీ నేతలు మద్దతుగా ఉండడంతో పోటీ తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్మోహన్ నాయుడు శాసనసభకు పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబును కలిసి అడిగినా ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు సెంటిమెంటు కోణంలో ఎర్రన్నాయుడి సతీమణే నేరుగా చంద్రబాబును రిక్వస్ట్ చేశారట.
రామ్మోహన్ కు బదులు అచ్చెన్నాయుడిని లోక్ సభకు పంపించాలని.. ఆయనైతేనే రాజకీయంగా వైసీపీని ఎదుర్కోగలరని ఆమె సూచించినట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు మాత్రం ఆమె మాటను తోసిపుచ్చారని తెలుస్తోంది.