Begin typing your search above and press return to search.

యస్ బ్యాంకు సంక్షోభానికి .. రూ.34,000 కోట్ల బ్యాడ్ లోన్లే కారణమా ..?

By:  Tupaki Desk   |   10 March 2020 10:40 AM GMT
యస్ బ్యాంకు సంక్షోభానికి .. రూ.34,000 కోట్ల బ్యాడ్ లోన్లే కారణమా ..?
X
మొన్నటి వరకు దేశంలోనే ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థలో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న YES బ్యాంక్ ..గత కొన్ని రోజులుగా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకొని, మూసేసే స్థాయికి దిగజారింది. దీనికి ఒక రకంగా YES బ్యాంక్ ఇచ్చిన బ్యాడ్ లోన్స్ కారణం అని చర్చించుకుంటున్నారు. అయితే , ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని , దారుణమైన పరిస్థితిని ఎదుర్కుంటున్న YES బ్యాంక్ ని ఆదుకోవడానికి SBI ముందుకు రావడంతో .. కస్టమర్లు, ఇన్వెస్టర్లు కొంత ఊరట చెందుతున్నారు. డిపాజిట్లను అక్రమ మార్గాల్లో తరలించినట్లుగా యస్ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో రానాకపూర్, అతని కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది.

అయితే, YES బ్యాంకు పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం ... బ్యాడ్ లోన్లు. ఫైనాన్షియల్ ఇండస్ట్రీ సోర్స్ ప్రకారం.. దాదాపు 10 పెద్ద బిజినెస్ గ్రూప్‌లకు చెందిన 44 కంపెనీలు యస్ బ్యాంకు నుండి పెద్ద మొత్తం లో రుణాలు తీసుకున్నాయి. వీటి బ్యాడ్ లోన్స్ వ్యాల్యూ దాదాపు రూ.34,000 కోట్లు. ఇందులో ఒక్క అనిల్ అంబానీ కి చెందిన 9 కంపెనీల వాటానే రూ.12,800 కోట్లు. అలాగే సుభాష్ చంద్రకు చెందిన ఎస్సెల్ గ్రూప్‌లోని 16 కంపెనీల బ్యాడ్ లోన్ల వ్యాల్యూ రూ.8,400 కోట్లుగా ఉంది. IL&FS బ్యాంకు బ్యాడ్ రుణాలు రూ.2,500 కోట్లు , అలాగే గత ఏడాది మూతబడిన జెట్ ఎయిర్వేస్‌ కు కూడా రూ.1,100 కోట్ల లోన్లు ఇచ్చినట్లుగా సమాచారం.

అలాగే ,కేర్కార్ గ్రూప్‌కు చెందిన కాక్స్ క్ష కింగ్స్, గో ట్రావెల్స్ రూ.1,000 కోట్లు, భారత్ ఇన్ఫ్రా, మెక్‌లియోడ్ రసెల్ అసోం టీ, ఎవరెడీ రూ.1,250 కోట్లు, ఓంకార్ రియాల్టర్స్ అండ్ డెవలపర్స్ రెండు ప్రాజెక్టులకు రూ.2,710 కోట్లు, రేడియస్ డెవలరప్స్ రూ.1,200 కోట్లు, థాపర్ గ్రూప్‌కు చెందిన సీజీ పవర్ రూ.500 కోట్లు ఉన్నాయి. అయితే , యస్ బ్యాంకు బ్యాడ్ లోన్లు అన్ని కూడా తీవ్రమైన ఒత్తిడి లో ఉన్న గ్రూప్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇన్‌ప్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఫైనాన్సియల్ సెక్టార్ వంటి రంగాలు ఎక్కువ గా ఉండటమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యం లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఎన్డీయే హయాం కంటే ముందు ప్రైవేట్ కంపెనీలు YES బ్యాంక్ నుండి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాయని, ప్రస్తుత యస్ బ్యాంకు సంక్షోభానికి ఆ కంపెనీలే కారణమని చెప్పారు.