Begin typing your search above and press return to search.

కోలుకుంటున్న య‌స్-బ్యాంక్ - షేర్ ధ‌ర భారీగా పెరిగింది!

By:  Tupaki Desk   |   17 March 2020 2:22 PM GMT
కోలుకుంటున్న య‌స్-బ్యాంక్ - షేర్ ధ‌ర భారీగా పెరిగింది!
X
క్రితం వారంలో ఆల్ టైమ్ లో ప‌లికిన య‌స్-బ్యాంక్ షేర్ ధ‌ర ఇప్పుడు ఆస‌క్తిదాయ‌క‌మైన మ‌లుపు తిరిగింది. మొండి బ‌కాయిలు పేరుకుపోవ‌డంతో యస్-బ్యాంకు సంక్షోభానికి లోనైన సంగ‌తి తెలిసిందే. దీని వ్య‌వ‌స్థాప‌కుడు ఇప్ప‌టికే అరెస్టు కూడా అయ్యాడు. అప‌రిమితంగా, ఇష్టానుసారం అప్పులు ఇచ్చి... వాటిని తిరిగి స‌రిగా వ‌సూలు చేయ‌లేక‌, డిపాజిట‌ర్ల సొమ్ముల‌కు క‌న్నం పెట్టింది య‌స్-బ్యాంకు. ఈ స్కామ్ ను మొద‌ట్లో గుర్తించ‌లేక‌పోయింది ఆర్బీఐ. అయితే చివ‌ర‌కు యస్-బ్యాంక్ ఫౌండ‌రే చేతులెత్తేయ‌డంతో క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

యస్-బ్యాంకు పున‌రుద్ధ‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. దీని కోస‌మ‌ని ఎస్బీఐ తో షేర్లు క‌నిపిస్తున్నారు. అలాగే వివిధ ప్రైవేట్ బ్యాంకులు కూడా త‌మ‌వంతుగా య‌స్-బ్యాంకులో పెట్టుబ‌డులు పెడుతున్నాయి. అయితే ఈ పెట్టుబ‌డులు అన్నీ క‌లిపినా య‌స్-బ్యాంకు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని త‌ట్టుకోలేని ప‌రిస్థితి. అయితే ఇప్పుడు కొంత‌లో కొంత ఊర‌ట ఏమిటంటే.. య‌స్-బ్యాంకు షేర్ విలువ ఏకంగా వెయ్యి శాతం పెర‌గ‌డం!

గ‌త‌వారంలో య‌స్-బ్యాంకుకు సంబంధించి షేర్ విలువ‌లో భారీ ప‌త‌నం చోటు చేసుకుంది. ఒక్కో షేర్ విలువ కేవ‌లం ఐదు రూపాయ‌ల స్థాయికి చేరింది. అది ఆ సంస్థ‌కు సంబంధించి ఆల్ టైమ్ లో. ఆ సంస్థ కుంభ‌కోణాన్ని ఎదుర్కొన‌గానే.. చాలా మంది వాటి షేర్ల‌ను అమ్మేయ ప్ర‌య‌త్నించారు. దీంతో షేర్ విలువ భారీగా ప‌త‌నం అయ్యింది. ఐదు రూపాయ‌ల స్థాయికి చేరింది.

అయితే మంగ‌ళ‌వారం ట్రేడ్ లో య‌స్-బ్యాంకు షేర్ విలువ 64 రూపాయ‌ల‌కు చేర‌డం గ‌మ‌నార్హం. ఇది భారీ పెరుగుద‌లే అని చెప్ప‌వ‌చ్చు. ఐదు రూపాయ‌ల ధ‌ర నుంచి వారం తిరిగే స‌రికి 64 రూపాయ‌ల‌కు చేర‌డం అంటే ఆ షేర్ల‌ను క‌లిగి ఉన్న వారు హ్యాపీనే.

ఆల్ టైమ్ లో ద‌శ‌లో ఉన్న‌ప్పుడు ఐదు వేల రూపాయ‌లు వెచ్చించి - వెయ్యి షేర్ల‌ను కొన్నా.. ఇప్పుడు ఐదు వేల రూపాయల విలువ కాస్తా.. మూడు ల‌క్ష‌ల ఇర‌వై వేల‌ రూపాయ‌లకు చేరిన‌ట్టే. అది కూడా వారం రోజుల వ్య‌వ‌ధిలో ఈ మార్పు చోటు చేసుకోవ‌డం విశేషం. ఈ ఊపు చూస్తుంటే.. య‌స్-బ్యాంక్ షేర్ విలువ మ‌రింత పెరుగుతుందేమో!