Begin typing your search above and press return to search.
అవును ! పవన్ చెప్పింది నిజమే ! జీరో డేటాతో జగన్ పాలన !
By: Tupaki Desk | 29 April 2022 1:30 AM GMTకించపరిచి మాట్లాడడంతోనే పాలనను అస్తవ్యస్తం చేసుకుంటున్నా జగన్ అని విపక్షం ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. టు ద పాయింట్ మాట్లాడితే ఎటువంటి చిక్కులూ ఉండవని కూడా అంటోంది. పోలవరం విషయమై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తేలిపోయారు. వైద్య రంగంకు సంబంధించి దేశంలోనే బెస్ట్ హెల్త్ పాలసీ అమలు చేస్తున్నామని చెప్పిన సంబంధిత శాఖ మంత్రి విడదల రజనీ తేలిపోయారు.
అస్సలు నా దగ్గర ఆ విషయాలే మాట్లాడకండి అని చెప్పి జలవనరుల శాఖ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తేలిపోయారు. ఇక పవన్ ను ఎప్పటికప్పుడు తిట్టి తిట్టి పేర్ని నాని, కొడాలి నాని ఎప్పటికప్పుడు పరువు మరియు పవరు రెండూ పోగొట్టుకుంటూనే ఉన్నారు. అయినా కూడా మంత్రులలో మార్పు లేదు. వారి మాట తీరు మార లేదు. మారదు కూడా ! అదేవిధంగా పదవి ఉన్నా లేకపోయినా మాజీ మంత్రులయిన పేర్ని,కొడాలి మారరు గాక మారరు అని కూడా తేలిపోయింది అని అంటోంది టీడీపీ. ఇదే కామెంట్ ను జనసేన కూడా చేస్తోంది.
తాజాగా పవన్ చెప్పిన మాట జగన్ పాలన విషయమై నిజమైంది. మొన్నటి వేళ అనంతపురంలో కౌలు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి జగన్ ప్రభుత్వం దగ్గర డేటానే లేదని, ఎంత మంది చనిపోయారో ఎందుకు చనిపోయారో అన్న వివరాలు కూడా ఆయనకు తెలియవని అంటూ జగన్ సర్కారును ఆధారసహితంగా విమర్శించారు. ఇప్పుడిదే నిజం అయింది ఆరోజు పవన్ తన పరిధిలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల వివరాలను సేకరించారు.
ఇందుకు ఓ స్వచ్ఛంద సంస్థ సాయం తీసుకున్నారు. అంతే కాకుండా తన అభిమానులను క్షేత్ర స్థాయిలో అప్రమత్తం చేసి, మీ పరిధిలో ఎవ్వరైనా ఆత్మహత్యకు సిద్ధం అయితే పార్టీ దృష్టికి తీసుకురండి వెంటనే ఆ కుటుంబానికి పార్టీ తరఫున సాయం అందుతుంది అని కూడా చెప్పివెళ్లారు.
ఇప్పుడిదే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి రెండు జిల్లాల్లో (ఉమ్మడి అనంతపురం, పశ్చిమ గోదావరి) కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహించేటప్పుడు ఆయా ప్రాంతాలలో పవన్ కు మంచి ఆదరణ దక్కింది. దీంతో అప్రమత్తమయిన ప్రభుత్వం వెంటనే వలంటీర్లను రంగంలోకి దించి, సంబంధిత సమాచారం సేకరించాలని, ఆత్మ హత్య చేసుకున్న రైతుల కుటుంబాల వివరాలు వీలున్నంత త్వరగా పంపాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి వాట్సాప్ మెసేజ్ పంపి, వలంటీర్లను క్షేత్ర స్థాయిలో అప్రమత్తం చేసింది.
అంటే ఆ రోజు జనసేనాని చెప్పింది నిజమే కదా! కౌలు రైతుల విషయమై కానీ రైతుల విషయమై కానీ ఈ ప్రభుత్వం దగ్గర డేటా లేదన్నది నిజమే కదా! అంటే జీరో డేటాతోనే వైసీపీ పాలన సాగిస్తుందన్నది నిజమే కదా ! అంటోంది జనసేన. తమ అధినేత వచ్చాకే పాలకుల్లో కదలిక వచ్చిందని, నిజంగా ఇది ఒక శుభ పరిణామమని అంటున్నారు వీరంతా ! ఇప్పటికైనా నిజాలు ఒప్పుకుంటే మేలు అని, ప్రజల దగ్గర పరువు పోదని కూడా హితవు చెబుతున్నారు.