Begin typing your search above and press return to search.
కేసుల పరంపర: రవిప్రకాష్ పై మరో కేసు
By: Tupaki Desk | 17 Oct 2019 10:54 AM GMTటీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై కేసుల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆయన తనను ఎవరెలా టార్గెట్ చేస్తున్నారో సోషల్ మీడియాలో ఓ వివరణతో కూడిన పోస్టు పెట్టి మరింత సంచలనం రేపారు. ఈ క్రమంలోనే ఆయనపై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కేసులో రవిప్రకాష్ పై ఈ తాజా కేసు నమోదైంది. ‘ఐ ల్యాబ్’ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద రవిప్రకాష్ ఓ ఫేక్ ఐడీ క్రియేట్ చేశాడు.
దీంతో 406/66 ఐటీ యాక్ట్ కింద ఆయనపై ఈ కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న రవిప్రకాష్ ను పిటీ వారెంట్ పై సైబరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే రవిప్రకాష్ పై నిధులు గోల్ మాల్ వ్యవహారంతో పాటు టీవీ9 లో ఫండ్ ను అక్రమంగా తరలించారన్న ఆరోపణల నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ రెండు కేసులతో పాటు టీవీ 9 ఆఫీస్ కు వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం... ఇటీవల ఆయన ఇంటికి వెళ్లినప్పుడు కూడా పోలీసులకు సహకరించలేదన్న అభియోగాలు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ రెండు కేసుల్లోనూ ఇప్పటికే రవిప్రకాష్ కు 41 సీఆర్పీసీ నోటీసులిచ్చారు. ఏదేమైనా రవిప్రకాష్ పై వరుసగా కేసులు నమోదవుతుండడంతో ఆయన ఈ కేసుల ఊబిలో చిక్కుకుపోతున్నాడు. మరి వీటి నుంచి ఎప్పటకి విముక్తి ఉంటుందో ..?