Begin typing your search above and press return to search.

సైన్టిస్టులకి అంతుచిక్కని యోగాసనాలు

By:  Tupaki Desk   |   21 Jun 2020 6:15 AM GMT
సైన్టిస్టులకి అంతుచిక్కని యోగాసనాలు
X
జూన్‌ 21.. అంతర్జాతీయంగా భారత ఖ్యాతి ఇనుమడించే రోజు. దేశ దేశాల్లో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా కొన్ని కోట్లమంది యోగాసనాలు ఆచరించే రోజు. ప్రాచీన భారతీయ సంస్కృతిని కొనియాడే రోజు. ఆరేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించింది మొదలు ఏటికేడాది దీని ప్రాభవం, ప్రాముఖ్యత పెరుగుతూనే ఉన్నాయి. భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ యోగా దినోత్సవాలకు పిలుపునివ్వడం ఒక విశేషమైతే.. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం దీన్ని గుర్తించి అందరూ యోగా ద్వారా స్వస్థత పొందాలని కోరడం ఇంకో విశేషం.

అయితే ప్రస్తుత వైరస్ కష్టకాలంలో మునుపటిలా బహిరంగంగా యోగాసనాలు వేయడం సాధ్యం కాకపోవచ్చుగానీ.. వర్చువల్‌ యోగా దినోత్సవాలకు మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరోగ్యం కోసం యోగా.. ఇంట్లోనే యోగా’’ అనే ఇతివృత్తంతో ఈ రోజు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ తో కలిసి ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఓ వీడియో బ్లాగింగ్‌ పోటీని కూడా ఏర్పాటుచేసింది. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ‘‘ఇంట్లోనే యోగా.. కుటుంబం తో కలిసి యోగా’ పేరుతో ఇప్పటికే ప్రచారం చేపట్టింది.

ఆదివారం ఉదయం 6.30 నిమిషాలకు దూరదర్శన్‌ చానల్‌ లో ఓ యోగ సాధన కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. అలాగే మైసూరు జిల్లా యంత్రాంగం, ఇంటర్నేషనల్‌ నేచురోపతి ఆర్గనైజేషన్లు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాయి. కర్ణాటకలోని పుణ్యక్షేత్రం ధర్మస్థలలో ఉదయం ఏడు గంటలకు యోగాభ్యాసం మొదలుకానుంది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అమెరికాలోని టెక్సాస్‌ తోపాటు అనేక ఇతర రాష్ట్రాల వారికి యోగా పాఠాలను బాబా రామ్ ‌దేవ్‌ ఆన్‌ లైన్‌ ద్వారా అందించనున్నారు.

మానసిక ఒత్తిడికి కారణమైన హార్మోన్‌ కార్టిసోల్‌ మోతాదులను తగ్గించేందుకు యోగా ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. ధ్యానం వంటివాటిని కలిపి యోగా ఆచరిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలుంటాయని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడును శాంతపరిచేందుకు ఉపయోగపడే సెరటోనిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది కాబట్టి మనో వ్యాకులతకూ యోగా మంచి మందని అధ్యయనాలు చెబుతున్నాయి.

వారానికి కనీసం రెండు రోజుల చొప్పున రెండు నెలలపాటు యోగా కొనసాగిస్తే మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలకూ అంతుపట్టకపోవడం గమనార్హం. వారానికి కనీసం రెండు రోజుల చొప్పున రెండు నెలలపాటు యోగా కొనసాగిస్తే మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలకూ అంతుపట్టకపోవడం గమనార్హం. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా కూడా తోడైతే గుండె జబ్బులు సోకే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి.

135 మంది వయోవృద్ధులపై జరిగిన ఒక పరిశోధనలో యోగాభ్యాసం చేసే వారి జీవన నాణ్యత ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేందుకూ యోగా పనికొస్తుంది. కీమోథెరపీ చేయించుకున్న వారు యోగా సాధన చేస్తే వాంతులు, తలతిరుగుడు వంటి దుష్ఫలితాలు తగ్గుతాయని, నొప్పి తగ్గడమే కాకుండా చురుకుదనమూ పెరుగుతుందని తేలింది. అలాగే హాయిగా నిద్రపోవాలన్నా యోగా ప్రాక్టీస్‌ చేయడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఊబకాయం, అధిక రక్తపోటు, మనో వ్యాకులత వంటి లక్షణాల కారణంగా నిద్రలేమి సమస్య ఎదుర్కొన్న వారు యోగాభ్యాసం మొదలుపెట్టిన తరువాత ఎంతో ఉపశమనం పొందారని 2005 నాటి అధ్యయనం ఒకటి చెబుతోంది.

ఈ కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగ సాధన ద్వారా కూడా రోగ నిరోధకశక్తిని కాపాడుకోవచ్చు. సలంబ భుజంగాసనం, పరివృత్త ఉత్కటాసనం, అనువిత్తాసన, గరుడాసన, త్రికోణాసనం, ఆనంద బాలాసనం వంటి ఆరు యోగాసనాలు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. యోగా సాధన వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవచ్చని ప్రధానీ నరేంద్ర మోదీ తెలిపారు. యోగాతో శ్వాస వ్యవస్థ మెరుగుపడుతుందని అన్నారు. ఆది వారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్ ‌లైన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. యోగా చేయడం వల్ల ఉల్లాసం, మనోధైర్యం, మానసిక స్థిరత్వం, ఒత్తిడి నుంచి ఉపసమనం పొందవచ్చని అన్నారు. ప్రపంచం మొత్తం యోగాను గుర్తించిందన్నారు. కరోనా దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని తెలిపారు.