Begin typing your search above and press return to search.

మందుబాటిళ్ల మీద యోగాసనాలు .. దేవతాఫోజు పెట్టబోతే ఏం జరిగిందంటే ?

By:  Tupaki Desk   |   28 Jun 2021 7:37 AM GMT
మందుబాటిళ్ల మీద యోగాసనాలు  .. దేవతాఫోజు పెట్టబోతే ఏం జరిగిందంటే ?
X
యోగా .. ఒకప్పుడు దీనిపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ, ఆ తర్వాత యోగా గురించి పూర్తిగా తెలుసుకొని యోగాసనాలు వేయడం మొదలుపెట్టారు. ఆరోగ్యంగా ఉండడానికి, ఫిట్ గా ఉండడానికి యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది. సామాన్యుల నుండి సినీ స్టార్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా యోగాసనాలు వేస్తుంటారు. ముఖ్యంగా రకరకాల ఆసనాలతో ఇంటర్నెట్ అటెన్షన్ కొట్టేయడానికి, తద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీ అవ్వడానికి చాలామంది అనేక రకాల యోగాసనాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇక, సెలబ్రిటీలైతే రకరకాల యోగ ఆసనాలని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వాళ్లను వాళ్లు ప్రమోట్‌ చేసుకుంటున్నారు.

వారిలాగే ఫెమస్ అవ్వాలని ,ఓ యువతి సడెన్ స్టార్ స్టేటస్ అందుకోవాలని, ఓ సరికొత్త ఆసనాన్ని ట్రై చేయాలని చివరికి బొక్కాబోర్లా పడింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే .. బార్‌ టేబుల్‌ పై కొంచెం ఎత్తులో రెండు మందు బాటిళ్లపై కాళ్లు పెట్టి, చాలా కష్టతరమైన ఫోజు కోసం ఆ యువతి ప్రయత్నించింది. దేవతా మూర్తి తరహాలో ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించింది. అయితే బ్యాలెన్స్‌ పట్టలేక బొక్కబోర్లా పడింది. ఇది ఇంతవరకే వీడియోలో కనిపిస్తుంది. అయితే ఆ తరువాత యువతికి ఎలా ఉంది, ఏం జరిగింది, వీడియో ఎక్కడిది, ఎప్పటిది, అనే విషయాలపై మాత్రం క్లారిటీ లేదు. హోల్డ్‌ మై బీర్‌ అనే ట్విటర్‌ అకౌంట్‌ నుంచి వైరల్‌ అయిన ఈ వీడియోను షేర్‌ చేస్తున్న పలువురు డోంట్‌ ట్రై దిస్‌ అనే క్యాష్షన్‌ తో షేర్ చేస్తున్నారు.