Begin typing your search above and press return to search.

సీఎం రాకింగ్ః 150 గంటలు..50 నిర్ణయాలు

By:  Tupaki Desk   |   27 March 2017 10:09 AM GMT
సీఎం రాకింగ్ః 150 గంటలు..50 నిర్ణయాలు
X
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పాలనలో దూకుడు పెంచారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 150 గంటల్లో 50 కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. ఆదిత్యనాథ్ తీసుకున్న మొదటి నిర్ణయం అక్రమంగా నిర్వహిస్తున్న కబేళాలను మూసివేయడం. ఆ తర్వాత రోమియో స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. మంత్రివర్గ సమావేశం జరగకుండానే యోగి ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నారు.ఇప్పుడు ఆ నిర్ణ‌యాలు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నానికి దారితీస్తున్నాయి.

యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇవి

-అక్రమ కబేళాలను మూసివేయడం

-జూన్ 15,2017 నాటికి గుంతలు లేని రోడ్లను తయారు చేయడం

-మహిళల భద్రత కోసం యాంటీ రోమియో స్కాడ్ బృందాలు

-పాఠశాలలకు వెళ్లే టీచర్లు టీ-షర్ట్స్ ధరించొద్దు

-విధుల్లో ఉన్నప్పుడు టీచర్లు సెల్‌ఫోన్లు వినియోగించొద్దు

-ప్రభుత్వ కార్యలయాల్లో పాన్, గుట్కా నిషేధం

-ప్రజాసమస్యల పరిష్కారానికి స్పందించేందుకు సిటిజన్ చార్టర్ ఏర్పాటు

-అన్ని ప్రభుత్వ శాఖలు నెల చివరన నివేదిక ఇవ్వాలి

-ప్రభుత్వ ఆఫీసుల్లో బయోమెట్రిక్ అటెండెన్స్

-ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు

-ప్రభుత్వ దస్ర్తాలను ఉద్యోగులు తమ నివాసాలకు తీసుకెళ్లకూడదు

-రాజకీయ నేతల భద్రతపై సమీక్షలు

-అధికారులు, మంత్రులు ఆస్తులు వెల్లడించాలి

-సహకార సంఘాలన్నీ తమ పనులను నిర్వర్తించాలి


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/