Begin typing your search above and press return to search.
హనుమంతుడు దళితుడు..సీఎంకు నోటీసులు
By: Tupaki Desk | 29 Nov 2018 10:02 AM GMTఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనూహ్య వివాదంలో చిక్కుకున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమంతుడు దళిత గిరిజనుడని చెప్పారు. రామ భక్తులందరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కేవలం రావణుడిని పూజించే వాళ్లు మాత్రమే కాంగ్రెస్ కు ఓట్లు వేస్తారని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలంటూ ప్రస్తుతం ఆందోళనలు జరుగుతుండటం, కులం పేరుతో ఓట్లు అడగడంతో ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బుధవారం రాజస్థాన్ లోని మల్ పురా నియోజకవర్గం ఎన్నికల సభలో పాల్గొన్న ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ``హనుమంతుడు గిరిజనుడు. ఆయన అడవిలో నివసించేవాడు. రాముడి కోరిక మేరకు హనుమంతుడు తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం ఇలా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను ఏకం చేయడానికి ప్రయత్నించాడు. మేము కూడా రాముడి కోరికను నెరవేర్చేదాకా నిద్రపోం`` అని తెలిపారు.
కాగా, హనుమంతున్ని దళితుడంటూ యోగి చేసిన వ్యాఖ్యలపై రాజస్థాన్ సర్వ బ్రాహ్మణ మహాసభ లీగల్ నోటీసు ఇచ్చింది. మూడు రోజుల్లో క్షణాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. హనుమంతుడు దళితుడు అని చెప్పినందుకు మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సురేష్ మిశ్రా నోటీసులు జారీ చేసింది.
కాగా, ఇంతకుముందే మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. `90% మంది ముస్లింలు కాంగ్రెస్ కే ఓటు వేయాలని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు - కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. కాంగ్రెస్‌కు ఎస్సీ - ఎస్టీల ఓట్లు అవసరం లేదని తెలుస్తున్నది. కాంగ్రెస్ కు కేవలం ముస్లింల ఓట్లు ఉంటే సరిపోతుంది. మీ అలీని మీ వద్దే ఉంచుకోండి.. మాకు బజరంగ్ భళీ (హనుమంతుడు) చాలు` అని పేర్కొన్నారు. కాగా, దీనిపై వివాదం చెలరేగింది.