Begin typing your search above and press return to search.

3 రోజుల్లోనే యూపీలో ‘యోగి’ మార్క్

By:  Tupaki Desk   |   23 March 2017 4:34 AM GMT
3 రోజుల్లోనే యూపీలో ‘యోగి’ మార్క్
X
రౌతుకు తగ్గట్లే గుర్రం నడుస్తుందని ఊరికే అనలేదేమో. తాజాగా యూపీలోచోటు చేసుకుంటున్న పరిణామాలు చూసినప్పుడు ఈ సామెత గుర్తుకు రాక మానదు. సమాజ్ వాదీ పార్టీఅధికారంలో ఉన్న వేళ.. ఉత్తరప్రదేశ్ అంటేనే నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా గుర్తుకు వచ్చేది. అయితే.. అనూహ్య పరిణామాల మధ్య యూపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన యోగి ఆధిత్యనాథ్ మూడు రోజుల వ్యవధిలో పాలనలో తన మార్క్ ను చూపిస్తున్నారు. మంత్రులకు శాఖల్ని కేటాయించిన ఆయన.. కీలకమైన హోం..మైనింగ్ సహా పలు శాఖల్ని తన దగ్గరే ఉంచేసుకోవటం గమనార్హం.

ఒకదాని వెంట ఒకటి చొప్పున నిర్ణయాలు తీసుకుంటూ పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మూడు రోజుల వ్యవధిలోనే ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం అయోద్యలో రామాయణ మ్యూజియానికి భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న ఆయన.. గోవుల స్మగ్లింగ్ పై కన్నెర్ర చేయటమే కాదు.. వాటికి చెక్ చెబుతూ అధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

అక్రమ గోవధ శాలల్ని మూసివేయాలని.. కఠినంగా వ్యవహరించాలన్న ఆదేశాలు ఇవ్వటమే కాదు.. ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ తన వ్యక్తిగత వెబ్ సైట్లో తమ అభిప్రాయాల్నిచెప్పాలని కోరటం..అందుకు స్పందనగా బుధవారం సాయంత్రానికి నమోదైన స్పందనలలో 80 శాతం మంది గోవధను కఠినంగా అమలు చేసే చట్టాలు కావాలని కోరటం కనిపిస్తుంది. మరో 19 శాతం మంది అందుకు భిన్నంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

అక్రమ గోవధ.. గోవుల స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపిన ఆదిత్యనాథన్.. ఇంకోవైపు యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలితాల్నినిలిపివేస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకోవటంతో పాటు.. మహిళలపై నేరాలకు చెక్ పెట్టేలా యాంటీ రోమియో స్వ్కాడ్ లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నోటి నుంచి ఆదేశాలువచ్చిన వెంటనే లక్నో జోన్ పరిధిలోని 11 జిల్లాల్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక పోలీసుల్ని ఏర్పాటు చేయటమే కాదు.. లక్నోలో ముగ్గురిని.. అలహాబాద్ లో 16 మందిని.. మిగిలిన 9 జిల్లాల్లో పలువురు ఆకతాయిల్ని అరెస్ట్ చేశారు. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలతో యోగి పాలనలో తన మార్క్ ను చూపిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/