Begin typing your search above and press return to search.
యోగీ సంచలనం..మూడు లక్షల మంది రోడ్డుపాలు
By: Tupaki Desk | 23 Dec 2018 4:04 PM GMTసంచలన - వివాదాస్పద నిర్ణయాలకు పెట్టింది పేరు అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోమారు అదే తరహాలో ఇంకో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల నుంచి ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ (ప్రయాగరాజ్)లో ప్రారంభం కానున్న మహా కుంభమేళా కారణంగా రెండు జిల్లాల పరిధిలోని తోళ్ల పరిశ్రమలను - మాంసం దుకాణాలను మూడు నెలలపాటు మూసివేస్తూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. కాన్పూర్ - ఉన్నావ్ లో ఉన్న 264 పరిశ్రమలపై దీని ప్రభావం తీవ్రంగా పడనుంది. యూపీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యాపారులు - ఎగుమతిదారులు అభ్యంతరం వ్యక్తంచేస్తుండగా - తోళ్ల పరిశ్రమపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.
వచ్చే ఏడాది జనవరి 15 నుంచి మార్చి 4వ తేదీ వరకు అలహాబాద్ లో జరిగే కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచీ లక్షలాదిమంది భక్తులు పవిత్ర గంగాస్నానాల కోసం హాజరుకానున్నారు. కుంభమేళా కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భక్తుల బసకు ఫంక్షన్‌హాళ్లును వాడుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం.. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల పాటు పెండ్లిళ్లు తదితర సామూహిక కార్యక్రమాలను జరుపుకోరాదని స్థానిక ప్రజలకు సూచించింది. అంతటితో ఆగకుండా - తోళ్ల పరిశ్రమల నుంచి వ్యర్థజలాలు గంగానదిలో కలిసే అవకాశముందని భావిస్తూ.. ఏకంగా పరిశ్రమలను మూడునెలలపాటు మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. కుంభమేళాకు ముందు వచ్చే అర్ధ కుంభమేళాను కలుపుకొని డిసెంబర్ 15 నుంచి మా ర్చి 15వ తేదీవరకు కాన్పూర్ - ఉన్నావ్ జిల్లాల్లోని తోళ్ల పరిశ్రమలను పూర్తిగా మూసివేయాలంటూ ఆదేశాలిచ్చింది. అలాగే సమీప జిల్లాల్లో ఉన్న 249 పరిశ్రమల పని వేళలను - ఉత్పత్తిని సగానికి తగ్గించింది. అలహాబాద్ పరిసరాల్లోని మాంసం దుకాణాలను కూడా మూసివేయాలని ఆదేశించింది. ఉన్నావ్ - కాన్పూర్ లలో ఉన్న పరిశ్రమలకు ప్రస్తుత శీతాకాలం మంచి సీజన్. ఈ తరుణంలో ప్రతినెలా సగటున రూ.2వేల కోట్ల వరకు తోళ్లు - ఇతర మాంసం ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. ఇవి కాకుండా దేశీయ విక్రయాలు - ఇతరత్రా కలుపుకొంటే ప్రతినెలా వీటి టర్నోవర్ రూ.4వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. మూడు నెలల పాటు పరిశ్రమలను మూసివేస్తే.. ఈ రంగానికి సుమారు రూ.12వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గంగానదిలో తోళ్ల పరిశ్రమ నుంచి వ్యర్థజలాలు కలుస్తాయన్న వాదనతోనూ వ్యాపారులు ఏకీభవించడం లేదు.
వ్యర్థజలాలను మూడుసార్లు శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదులుతాం. వాటిలోనూ 80శాతానికి పైగా జలాలు రాయ్‌బరేలి వంటి ప్రాంతాలకు మళ్లుతాయి. గంగానదిలో చేరేది అతిస్వల్పమే. ఆ నీటిని కూడా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలోని తొమ్మిది శుద్ధిప్లాంట్లు మరోసారి వడగట్టాకే నదిలోకి వదులుతాయి అని షాఆలం వివరించారు. మూడు నెలలపాటు ఫ్యాక్టరీల మూసివేత నిర్ణయం పారిశ్రామికంగా నష్టదాయకమని కేంద్ర వాణిజ్యమంత్రిత్వశాఖ యూపీ సీఎం ఆదిత్యనాథ్ కు లేఖ కూడా రాసింది. గంగానదిలో పవిత్రస్నానాలు ఏడాది పొడవునా జరుగుతుంటాయి. కేవలం కొన్నిరోజులకే పరిమితం చేసి చూడటం, వాటి కారణంగా మూడునెలలపాటు పరిశ్రమలు మూసివేయడంలో ఎలాంటి హేతుబద్ధత లేదు అని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే వాటిని పెడచెవిన పెట్టిన యోగి సర్కార్ పరిశ్రమలకు మూడునెలల నిర్బంధ హాలిడే ప్రకటించింది.
పరిశ్రమల నుంచి వచ్చే జలాలను తాము శుద్ధి చేసి గంగానదిలోకి విడుదల చేయడంపై కాలుష్యనియంత్రణ మండలి అశక్తత వ్యక్తం చేసిన నేపథ్యంలోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మహాకుంభమేళా సందర్భంగా కొన్ని ముఖ్యమైన రోజుల్లో పరిశ్రమల మూసివేతకు మేం అంగీకరించాం. అయినా ప్రభుత్వం అందుకు ఒప్పుకోవడంలేదు. మొత్తంగా ఫ్యాక్టరీలు మూసివేయడం పరిష్కారమెలా అవుతుంది? అలా చేస్తే.. కుంభమేళా తర్వాత కూడా చాలావరకు పరిశ్రమలు ఎప్పటికీ తెరుచుకోలేవు అని అఖిల భారత తోలు ఎగుమతుల సమాఖ్య చైర్మన్ ముఖ్తార్ ఉల్ అమీన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ - బంగ్లాదేశ్ తర్వాత భారత్ ప్రధాన తోళ్ల ఎగుమతిదారు. అంతేకుండా అంతర్జాతీయ చెప్పుల ఉత్పత్తి రంగానికి 9శాతం ముడిసరుకు మనదేశం నుంచే వెళ్తున్నది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వ నిర్ణయం.. ఆ పరిశ్రమలకే కాకుండా - దేశ ఆర్థిక - ఉత్పత్తి రంగాలకూ తీవ్రంగా నష్టం చేకూరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.