Begin typing your search above and press return to search.
యోగి టీ అమ్ముతున్నాడే..వీడియో ఎందుకు వైరల్ అయిందంటే
By: Tupaki Desk | 15 Feb 2019 11:31 AM GMTఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన - వివాదాస్పద వార్తలతో తరచూ మీడియాలో దర్శనమిస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ఈ మాధ్యమాల కంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఎందుకో తెలుసా? అచ్చంగా యోగిని పోలి ఉన్న వ్యక్తి టీ అమ్ముతున్న ఫొటో ద్వారా. ఫేస్ బుక్ లో నీలం చతుర్వేది అనే వ్యక్తి `ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ్ముడు టీ అమ్ముతున్నాడు. కాంగ్రెస్ నేతల తమ్ముళ్లు ఎవరైనా ఇలాగే టీ అమ్మేవాళ్లు ఉంటే పోస్టు చేయండి` అంటూ ఓ పోస్టు చేశాడు. క్షణాల్లోనే ఫొటో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఈ వీడియో కొన్నిగంటల వ్యవధిలోనే 11వేల షేర్లు నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు మీడియా దానిపై నిజాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది. యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి సింగ్ ను కలవాలనుకున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త పురాణ్ పాయల్ ను కలుసుకుని విచారించడంతో ఇలాచెప్పారు. యోగికి ముగ్గురు సోదరులు - ముగ్గురు అక్కా చెల్లెల్లు ఉన్నారు. వారిలో ఎవ్వరూ టీ అమ్మే షాప్ నడిపించడం లేదని నిర్దారించారు. కాగా, వైరల్ అయిన వీడియో ఆధారంగా ఇద్దరు సోదరులతో ఓ ఛానల్ ఇంటర్వ్యూలో నిర్వహించింది. మూడో వ్యక్తి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ వ్యక్తి మాత్రం యోగికి సంబంధించిన వారు కాదని తెలిపింది.
అయితే, జాతీయ మీడియా ఇంత క్షుణ్ణంగా కూపీ లాగినప్పటికీ - నిజానికి అతనెవరో తెలియరాలేదు. కానీ, యోగి టీ అమ్ముతున్న వీడియో మాత్రం ఇప్పటికీ...ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ప్రముఖులంటే..సామాన్యుల్లో ఉండే క్రేజ్ కు ఇదే నిదర్శనం అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.