Begin typing your search above and press return to search.

యోగీ ఆదేశాల‌కు బ‌లైన ఆయ‌న కారు డ్రైవ‌ర్‌

By:  Tupaki Desk   |   1 April 2017 1:59 PM GMT
యోగీ ఆదేశాల‌కు బ‌లైన ఆయ‌న కారు డ్రైవ‌ర్‌
X
ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ కారు డ్రైవర్‌ కు పోలీసులు రూ. 500ను ఫైన్‌ గా విధించారు. నిబంధనలు అతిక్రమించినందుకుగానూ పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఆ నిబంధ‌న‌లు రూపొందించింది కూడా సీఎం యోగి కావ‌డం గ‌మ‌నార్హం. ప్రభుత్వ విధుల్లో ఉండగా డ్రైవర్ పొగాకును నమలడంతో గుర్తించిన పోలీసు సిబ్బంది అతనిపై చర్యలు తీసుకుంటూ ఫైన్ విధించారు!

రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో - ప్రభుత్వ విధుల్లో పాన్ మసాల - గుట్కా నమలడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణ‌యాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు పోలీసుల‌కు అధికారాలు సైతం అప్ప‌గించారు. దీంతో వారు నిబంధ‌న‌లను వ్య‌తిరేక‌స్తున్న వారి ప‌ని ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా సీఎం కారు డ్రైవ‌ర్‌ కు ఫైన్ వేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/