Begin typing your search above and press return to search.

ఒవైసీ హ‌నుమాన్ చాలీసా చ‌దువుతారా?

By:  Tupaki Desk   |   5 Feb 2020 5:08 AM GMT
ఒవైసీ హ‌నుమాన్ చాలీసా చ‌దువుతారా?
X
మజ్లిస్‌ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై బీజేపీ సీనియ‌ర్ నేత‌ - యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలోని షాహీన్‌ బాగ్‌ లో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక ఆందోళనలను ప్రధాని విమర్శించిన నేపథ్యంలో ఒవైసీ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీ కూడా ఏదో ఒక రోజు హ‌నుమాన్ చాలీసా చ‌దువుతార‌ని యోగి వ్యాఖ్యానించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల సందర్భంగా.. కిరారిలో జ‌రిగిన ప్ర‌చార స‌భ‌లో యోగి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా యోగి మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హ‌నుమాన్ చాలీసా చ‌ద‌వ‌డం మొద‌లుపెట్టార‌ని, ఇక ముందు ఏం జ‌రుగుతుందో కూడా మీకే తెలుస్తుంద‌ని - ఎంఐఎం నేత ఓవైసీ కూడా ఏదో ఒక రోజు హ‌నుమాన్ చాలీసా చ‌దువుతూ క‌నిపిస్తార‌ని అన్నారు. ఢిల్లీలోని ష‌హీన్ బాగ్‌ లో జ‌రుగుతున్న సీఏఏ వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ఆదిత్య‌నాథ్ ఖండించారు. సీఏఏ నిర‌స‌న‌కారుల‌కు ఇలాంటి నేత‌లు బిర్యానీలు అందిస్తున్నార‌ని, మ‌రో వైపు చాలీసా వల్లిస్తున్నార‌ని యోగి ఆరోపించారు.

కాగా, మజ్లిస్‌ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రధాని మోదీపై మండిప‌డ్డారు. ముస్లిం మహిళలకు తనను తాను సోదరుడినని చెప్పుకుంటున్న మోదీ ఇప్పుడు వారిని చూసి ఆయన ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ఆయన పాల్గొంటూ, ఎన్పీఆర్‌కు ఎన్నార్సీతో సంబంధం లేదని, దేశంలో ఎన్నార్సీని అమలు చేయబోమని ప్రధాని మోదీ సభలో స్పష్టం చేయాలని సవాలు చేశారు. పార్లమెంట్‌ చరిత్రలో మొదటిసారిగా ఓ బిల్లు (సీఏఏ) మతం ప్రాతిపదికన ఆమోదం పొందిందన్నారు. తాము అస్తిత్వం కోసం పోరాడే పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం కల్పించిందని, ఒకవేళ తాము ఓడిపోతే తమను తుడిచివేస్తారన్నారు.