Begin typing your search above and press return to search.
రాహుల్.. నీకు దమ్ముంటే నన్ను కౌగిలించుకో!
By: Tupaki Desk | 24 July 2018 1:21 PM GMTకౌగిలింత కలకలం ఇంకా సద్దుమణగనలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లోక్ సభ లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రాహుల్ చేసిన పనిని కొందరు సమర్థిస్తుంటే...ఇంకొందరు విమర్శిస్తున్నారు. అయితే, బీజేపీ మాత్రం ఆయన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. బీజేపీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఎపిసోడ్ పై స్పందించారు. తాజాగా ఆయన రాహుల్ పై విమర్శలు గుప్పించారు. నీకు దమ్ముంటే నన్ను హత్తుకో అని సవాల్ విసిరారు.
శుక్రవారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా తన ప్రసంగం ముగించిన రాహుల్ నేరుగా వెళ్లి మోడీని హత్తుకున్న విషయం తెలిసిందే. దీనిపై యోగి స్పందిస్తూ....రాహుల్ చేసింది కేవలం ఓ పొలిటికల్ స్టంట్ అని అన్నారు. రాహుల్ కు దమ్ముంటే నన్ను హగ్ చేసుకోవాలి. అంతేకాదు నన్ను హత్తుకునే ముందు రాహుల్ ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి అని యోగి అన్నారు. ``ఇలాంటి రాజకీయ జిమ్మిక్కులను నేను అస్సలు అంగీకరించను. రాహుల్ వి పిల్ల చేష్టలు. ఆయనకు అంత తెలివితేటలు లేవు. సొంతంగా నిర్ణయం తీసుకోలేరు. హుందాగా ఉండే వ్యక్తి ఎప్పుడూ ఇలాంటి పనులు చేయరు అని యోగి అన్నారు. గత ఇక రాహుల్ ను ప్రతి పక్షాలు ఎలా అంగీకరిస్తాయో అర్థం కావడం లేదు`` అని ఈ సందర్భంగా యోగి అన్నారు. రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ - మాయావతి అంగీకరిస్తారా? శరద్ పవర్ ఆయన నాయకత్వంలో పనిచేస్తారా? ప్రతిపక్షాలు తమ నేతగా ఎవరినీ ఎందుకు ప్రకటించడం లేదు? ప్రతిపక్షంలో ఎవరి పాట వాళ్లు పాడుతున్నారు అని యోగి విమర్శించారు.