Begin typing your search above and press return to search.
పోస్టర్ల కలకలం:కాబోయే ప్రధానమంత్రి యోగి
By: Tupaki Desk | 25 Dec 2018 5:22 PM GMTఓ వైపు బీజేపీ ప్రజాదరణ పెద్ద ఎత్తున దగ్గిపోతుందనే వార్తలు సంచలనంగా మారుతుండగా మరోవైపు ఆ పార్టీలో ప్రధానమంత్రి అభ్యర్థుల పేరు తెరమీదకు వస్తోంది. నరేంద్రమోడీని కాదని ఒకరి తర్వాత మరొకరి పేరును పార్టీ నేతలు - సానుభూతిపరులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ పేరును పలువురు ప్రస్తావించగా తాజాగా యోగి ఆదిత్యనాథ్ కాబోయే ప్రధాని అంటూ పోస్టర్లు వెలిశాయి.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా పట్టణంలో వాడవాడలా యోగి పేరుతో పోస్టర్లు వెలిశాయి. కలియుగ అవతార పురుషుడు యోగి...కాబోయే ప్రధాని యోగి అంటూ హోర్డింగులు వెలిశాయి. యూపీ నవనిర్మాణ సేన ఏర్పాటు చేసిన ఈ హోర్డింగులు పట్టణాన్ని హోరెత్తించగా అధికారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెత్తించాయి. ప్రధానిగా యోగి అని చేపట్టిన ప్రచారంలో భాగంగా నవనిర్మాణ సేన వీటిని ఏర్పాటు చేసినప్పటికీ - బీజేపీ అగ్రనాయకత్వానికి ఆగ్రహం తెప్పించే ఈ ప్రచారం అధికార యంత్రాంగాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఆగ్రా మేయర్ నవీన్ జైన్ వెంటనే తేరుకుని వీటిని తొలగించి వేయాలంటూ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. అంతేగాక ఈ హోర్డింగులకు స్థానం కల్పించిన ప్రచార సంస్థపై చర్యలకు అధికారులు సంసిద్ధమవుతున్నారు.
ఇదిలాఉండగా - ఒక హోర్డింగులో వేసిన చిత్రాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చినందుకు శ్రీరాముడు యోగి ఆదిత్యనాథ్ కు ధన్యవాదాలు చెబుతున్నట్లుగా ఈ చిత్రాన్ని వేశారు. అలాగే మరో హోర్డింగులో యోగిని భావి ప్రధానమంత్రిగా - కార్యదక్షుడిగా చిత్రీకరించారు. అయితే ఈ రూపంలో వాటిని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.