Begin typing your search above and press return to search.
యోగీ పూనకంలో బీజేపీ?
By: Tupaki Desk | 8 March 2022 11:30 PM GMTఅప్పుడే పూనకం మొదలయింది.అయోధ్య కథ ఎలా ఉందో తెలియకుండానే అప్పుడే యోగీ భజన మొదలయిపోయింది.దీంతో పాపం మోడీ భక్తులలో కలవరం తీవ్రం అవుతోంది.బీజేపీలో అప్పుడే రెండు వర్గాలు వచ్చేశాయి.ఒకటి మోడీ రెండు యోగీ.. ఇంకో వర్గం ఉన్నా కూడా మాట్లాడేందుకు లేదు లేండి.అదే వెంకయ్య నాయుడి వర్గం.ఒకప్పుడు బీజేపీ ని ఆర్ఎస్ఎస్ నడిపేది..శివసేన నడిపేది.
కానీ ఇప్పుడు ఆ రెండూ కాకుండా కార్పొరేట్ శక్తులే నడిపిస్తున్నాయి అన్న అభియోగంలో ఆ పార్టీ ఉండిపోతోంది.అందుకు తగ్గ విధంగా బీజేపీకి అనుబంధంగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా తయారవుతున్నాయి.ఈ దశలో కార్పొరేట్ శక్తుల వెన్నుదన్ను ఇప్పటికైతే మోడీకి ఉంది కనుక ఆయన సేఫ్.
కానీ ఉత్తర ప్రదేశ్ లో ఢంకా బజాయించి విజయ దుందుభి మోగిస్తే భవిష్య కాలంలో ఇవే కార్పొరేట్ కంపెనీ వర్గాలు యోగీ చుట్టూ చేరి భజన చేయవు అని ఏంటి గ్యారంటీ? కనుక మోడీకి దూరంగా యోగీ కానీ యోగీకి దూరంగా మోడీ కానీ ఉంటే మేలు.
అయ్యో అయ్యయ్యో.. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇలా వచ్చాయో లేదో మోడీ కాదు భవిష్యత్ నాయకుడు యోగీనే అని కొందరు బీజేపీ అతి వాదులు వాదిస్తున్నారు.దీంతో చాలా మంది యూపీ ఫలితాలు రాకుండానే సీఎం యోగీ అంటూ మళ్లీ మళ్లీ ఆయనే ఉంటారని చెబుతూ, స్వీట్లు తినేస్తున్నారు.బాగుంది స్వీట్లు తినుడు అరుచుకొనుడు ఎలా ఉన్నా కూడా వచ్చే ఎన్నికలకు చాలా దూరం ఉంది.
సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాముడే అవసరం అయి ఉంటే ఏం చేయలేం. అంతకుమించి చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. పాపం యోగీ ని మాత్రం మోడీ కన్నా భిన్నంగా బీజేపీ నేతలు గుర్తించి ఇప్పటి నుంచి ఆయన గారి భజన ఒకటి చేయడం వింత.వింతల్లో కెల్లా వింత.