Begin typing your search above and press return to search.
యోగీకే ఫుల్ సపోర్ట్...ఇదేంటి బాసూ ?
By: Tupaki Desk | 12 March 2022 1:30 AM GMTదేశంలో ఇపుడు మోడీకి పోటీగా మరో నేత తయారు అయ్యారు. ఆయనే యూపీని రెండవసారి అవలీలగా గెలిపించిన యోగీ ఆదిత్యనాధ్. ఆయన కూడా బీజేపీ వారే కదా ఎందుకు పోటీ అన్న డౌట్లు ఉండవచ్చు.
కానీ అధికారం ముందు అన్నదమ్ముల బంధం అయినా బలాదూర్. ఇది భారత దేశ రాజకీయాల్లో చాలా సార్లు రుజువు అయింది. ఇపుడు మోడీని మూడవసారి ప్రధాని కాకుండా అడ్డుపడగలిగే బడా నేత ఎవరైనా బీజేపీలో ఉన్నారు అంటే అది ఒక్క యోగీ మాస్టారు మాత్రమే అంటున్నారు.
యోగీ యూపీ విజయం తరువాత దేశవ్యాప్తంగా ఒక్కసారిగా హాట్ ఫేవరేట్ గా ముందుకు వచ్చేశారు. సోషల్ మీడియాలో అయితే యోగీ నామస్మరణ పెద్ద ఎత్తున సాగుతోంది. మోడీ వర్సెస్ యోగీ అంటే ఎక్కువ మద్దతు యోగీకే దక్కుతోంది. దీని మీద ట్విటర్ పోల్స్ పెడితే యోగీకి ఏకంగా 65 శాతం నెటిజన్లు మద్దతు ఇవ్వడం విశేషం.
యోగీని అడ్మినిస్త్రేటర్ అని కీర్తిస్తున్నారు. ఆయన మాటల కంటే చేతలు ఎక్కువ అని నిరూపించుకున్నారని అంటున్నారు. మరో వైపు సైలెంట్ గా ఉంటూనే యూపీ కోటను రెండవసారి కొట్టిన యోగీ కంటే దేశానికి ప్రధాని పదవికి అర్హత ఎవరికి ఉందని కూడా నెటిజన్లు మద్దతు ఇస్తున్నారు.
మొత్తానికి చూస్తే ఇదేదో బీజేపీలో భూకంపాన్ని పుట్టించేలా ఉందనే అంటున్నారు. యోగీని అనూహ్యంగా రీతిలో సీఎం పదవికి ఎంపిక చేసిందే మోడీ షా ద్వయం. ఆయన కూడా ఎంపీ పదవిని వదిలేసి అయిష్టంగా యూపీకి వెళ్లారు.
అయితే అయిదేళ్ల కాలంలో ఆయన తిరుగులేని విధంగా అక్కడ పట్టు సాధించారు. అది ఎంతలా అంటే గత రెండేళ్ళుగా ఆయన్ని కట్టడి చేయడానికి బీజేపీలోని పెద్ద తలకాయలు బాగానే ప్రయత్నం చేశారని అంటారు. ఇక యోగీ ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ సీటు కూడా కేంద్ర పెద్దలు ఎంపిక చేయాలని చూశారట.
ఆ విధంగా ఆయన వెనక ఒక రాజకీయ తంత్రమే నడించింది అని చెబుతారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పటిదాకా బీజేపీ అంటే మోడీ షా ల పేర్లే గట్టిగా వినిపించేవి. యూపీ రిజల్ట్స్ తో మూడవ పేరు యోగీది అయింది. అంతే కాదు. ఆయన వస్తూనే పెద్దలు ఇద్దరి కంటే ఎక్కువగా జనాల మద్దతు పొందుతూండడం అంటే యోగీకి ప్రధాని యోగం ఉందనే అంటున్నారు.
ఇక యోగీ యూపీ వంటి పెద్ద స్టేట్ కి సీఎం గా ఉన్నా కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా సాధారణంగా ఉంటారు. తాము సీఎం చుట్టాలమని ఎక్కడా చెప్పుకోరు. ఇక యోగీ మార్క్ అంటే దూకుడే. విపక్షాలకు ఫియర్ గానే ఆయన రూల్స్ ఉంటాయి. ఆయన బుల్డోజర్ కి యూపీ నేరగాళ్ళు పరేషాన్ అవుతారు.
మరి ఆయన పాలనలో అవినీతి లేదు. అభివృద్ధి ఉంది. చెప్పిన మాట ప్రకారం ఆయన పనులు చేస్తారు. దాంతో యోగీ మాస్టార్ నే పీఎం గా చేసుకుంటే పోలా అన్నదే నెటిజన్ల భావనగా ఉందనుకోవాలి. మొత్తానికి 2014లో మోడీ ఫీవర్ తో ఒక్క లెక్కన ఊగిన సోషల్ మీడియా ఇపుడు యోగీ వైపు టర్న్ అవుతోంది అంటే దీని భావనేమి కమలదళమా అనుకోవాల్సి వస్తోంది.