Begin typing your search above and press return to search.
ఈసారికి సీఎం యోగీ..మరి రేపటికి...?
By: Tupaki Desk | 25 March 2022 2:30 AM GMTమొత్తానికి ముప్పయి ఆరు సంవత్సరాల తరువాత యూపీకి వరసగా రెండవసారి సీఎం అవుతున్నారు యోగీ ఆదిత్యనాధ్. ఆయన రెక్కల కష్టమే ఈ విజయం అని అంతా అంటున్నారు. ఈ నెల 25న సాయంత్రం నాలుగు గంటలకు లక్నోలోని ఎకానా స్టేడియంలో శుభ ముహూర్తాన యోగీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు.
ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా బీజేపీకి చెందిన యోధానుయోధులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. ఈ విజయం యోగీదేనని ఆయన అనుచరులు అంటున్నారు. ప్రధాని మోడీ మీద జన విశ్వాసానికి ఇది దర్పణం అని అమిత్ షా అంటున్నారు.
మొత్తానికి యోగీ రెండవసారి యూపీ వంటి పెద్ద స్టేట్ కి చీఫ్ మినిస్టర్ కావడం అంటే మామూలు విషయం కాదు. ఒక విధంగా యోగీ స్టేచర్ అటు పార్టీలోనూ ఇటు దేశ రాజకీయాల్లోనూ బాగా పెరిగింది. అంతే కాదు ప్రధాని మోడీకి వారసుడిగా యోగీ అవతరించారు అని అంటున్నారు.
ఇక యోగీ అభిమానులు అయితే ఈ రోజు సీఎం గా ప్రమాణం, రేపటి రోజున ఏకంగా దేశానికే ప్రధానిగా యోగీ ప్రమాణం అని నినదిస్తున్నారు. మరి అది నిజం అవుతుందా అంటే బీజేపీకి మోడీ తరువాత యోగీ మాత్రమే పవర్ ఫుల్ లీడర్ గా కనిపిస్తున్నారు. హిందూత్వకు ఆయన సూపర్ ఐకాన్ గా ఉన్నారు. ఆరెస్సెస్ కి ఆయన బహు ఇష్టుడు.
దానికి తోడు మోదీ ప్రధానిగా మూడవసారి గెలిచినా 75 ఏళ్ళు రాగానే ఆయన దిగిపోవాల్సి ఉంటుంది. అది ఆయన వచ్చాక బీజేపీలో పెట్టిన సరికొత్త నిబంధన. అది కనుక అమలు అయితే అంటే 2025 సెప్టెంబర్ 17 తరువాత కేంద్రంలో ప్రధానిగా యోగీయే బాధ్యతలు చేపడతారు అని అంటున్నారు. మరి సీఎం గా ప్రమాణానికి పెట్టిన ముహూర్తం పీఎం గా ప్రమోషన్ కి కూడా పనికివస్తుందా అన్నదే చూడాలిపుడు.