Begin typing your search above and press return to search.
ఆ అన్నాచెల్లెలు దెబ్బకు కాంగ్రెస్ ఖతమేనట.. యోగి సంచలనం
By: Tupaki Desk | 14 Feb 2022 12:36 PM GMTఐదురాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాటలు తూటాల మాదిరి పేలుతున్నాయి. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్న అంచనాల్ని వినిపిస్తున్న వేళ.. బీజేపీ మాత్రం తన గురిని కాంగ్రెస్ మీద పెట్టటం ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ మీద అసోం సీఎం దారుణ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు. ఈ రోజు యూపీ.. ఉత్తరాఖండ్.. గోవాలలో పోలింగ్ జరుగుతున్న వేళ.. ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు కమ్ అన్నాచెల్లెళ్లు అయిన రాహుల్.. ప్రియాంకలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని నాశనం చేయటానికి ఈ అన్నాచెల్లెలు చాలన్న ఆయన.. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ''గ్రాండ్ ఓల్డ్ పార్టీని నాశనం చేయటానికి ఈ అన్నాచెల్లెలు చాలు. ఇంకెవరు అవసరం లేదు. అలాంటి పార్టీకి ఎంుదకు మద్దతు ఇవ్వాలని ప్రజల్ని అడుగుతున్నా'' అని వ్యాఖ్యానించిన యోగి.. గతంలో రాహుల్.. ప్రియాంకల మధ్య గొడవలు ఉన్నాయని ఆరోపించటం సంచలనంగా మారింది. అయితే.. తమ మధ్య అలాంటివేమీ లేవంటూ ప్రియాంక స్పష్టం చేశారు.
అంతకు ముందు ఉత్తరాఖండ్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ప్రధాని మోడీ సైతం... కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేయటం.. 'కాంగ్రెస్ పూర్తిగా మునిగిపోయింది. ఎక్కడ తక్కువ ఉనికిలో ఉన్నా.. దానిని కిందకు నెట్టటానికి ఇద్దరు తోబుట్టువులు సిద్ధంగా ఉన్నారని.. కాబట్టి దానిని దాని విధికే వదిలేయాలి' అంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే యూపీ సీఎం యోగి చేసిన 80.. 20 వ్యాఖ్యలు సైతం వివాదంగా మారాయి. దీనిపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. తొలి విడత పోలింగ్ తర్వాత తాను చేసిన 80 శాతం వర్సెస్ 20 శాతం వ్యాఖ్యలను తప్పు అర్థాలు తీస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు.
యోగి వ్యాఖ్యలపై విపక్షాలు స్పందిస్తూ.. రాష్ట్రంలో హిందూ.. ముస్లిం జనాభాను ఉద్దేశించినట్లుగా చేసిన విమర్శల్ని యోగి తిప్పి కొట్టారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని.. 20 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని చెప్పటమే కాదు.. ఈ 20 శాతం వారు ఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినా ప్రతికూలంగానే ఆలోచిస్తారన్నారు.
అప్పట్లో కూడా తాను చెప్పింది ఇదే విషయమన్నారు. తానీ సందర్భంలోనూ ఇదే విషయాన్ని చెప్పానే తప్పించి.. మతం.. కులాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఏమైనా.. ఒకవైపు కాంగ్రెస్ బలం లేదని చెబుతూనే.. మరోవైపు ఆ పార్టీని నడిపిస్తున్న కీలక నేతలపై ట్వీట్ పంచ్ లతో పాటు. ఇంటర్వ్యూలోనూ ఘాటు విమర్శలు చేయటం గమనార్హం.