Begin typing your search above and press return to search.
యోగి 7 రికార్డుల బద్ధలు: అద్భుత విజయమే కాదు.. అంతకు మించి!
By: Tupaki Desk | 10 March 2022 4:30 PM GMTసందేహాలు తీరిపోయాయి. యూపీలో బీజేపీ విజయం సంపూర్ణమైంది. ముందుగా వెలువడిన అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. అన్నీ మీడియా సంస్థలు పేర్కొన్నట్లే.. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని యూపీ బీజేపీ.. తాజాగా వెల్లడైన ఎన్నికల్లో బంపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారి ఎమ్మెల్యేగా గోరఖ్ పూర్ అర్బన్ నుంచి బరిలోకి దిగారు.
యూపీలో బీజేపీ ఏ తీరులో దూసుకెళుందో.. యోగి సైతం తాను బరిలో ఉన్న గోరఖ్ పూర్ అర్బన్ లోనూ అంతే వేగంగా దూసుకెళుతోంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ రెండోసారి ఘన విజయాన్ని సొంతం చేసుకోవటంతో.. మరోసారి యోగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజా విజయంతో పలు రికార్డులు బద్ధలైపోతున్నాయి. సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా యోగి నిలిచారు. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం చూసినప్పుడు మొత్తం ఏడు రికార్డులు బద్ధలైనట్లుగా చెబుతున్నారు. అవేమంటే..
మొదటిది
డెబ్భై ఏళ్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొత్తం 21 మంది సీఎంలను చూస్తే.. ముగ్గురు మాత్రమే ఐదేళ్లు పూర్తి కాలం పాలించారు. వారిలో యోగి మూడో వ్యక్తి. ఆయనకు ముందు మాయావతి 2007-12 మధ్యలో సీఎంగా పూర్తి కాలం ఉంటే.. ఎస్పీకి చెందిన అఖిలేశ్ యాదవ్ 2012-17లో ముఖ్యమంత్రిగా పూర్తి కాలం ఉన్నారు.
రెండోది
అదేం సిత్రమో కానీ.. గడిచిన పదిహేనేళ్లలో యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంతా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారే. చివరకు ఘన విజయాన్ని సొంతం చేసుకున్న మాయావతి కానీ.. అఖిలేశ్ కానీ ఎమ్మెల్సీలుగా ఎన్నికై రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారే తప్పించి ఎమ్మెల్యేగా గెలవలేదు.
యోగి సైతం ఎమ్మెల్సీగానే ఎన్నికై ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. నిజానికి యూపీకి సీఎంగా బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసిన వేళలో.. ఆయన గోరఖ్ పూర్ ఎంపీగా వ్యవహరించేవారు. అనంతరం ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. తాజాగా మాత్రం ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. అనుకున్నట్లే భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో.. 15 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన నేత యూపీకి సీఎం కానున్నారు.
మూడోది
యూపీ రాజకీయ చరిత్రను చూస్తే.. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాక.. రెండోసారి సీఎం అయ్యే ఛాన్సు ఇప్పటివరకు లేదు. ఇప్పటివరకు అలా ముఖ్యమంత్రులు అయినవారు ఒకే ఒక్కరు ఉన్నారు. ఆయనే కాంగ్రెస్ కు చెందిన ఎన్డీ తివారి. 1985లో అవిభాజ్య యూపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి ఎవరూ ఇప్పటివరకు రెండోసారి సీఎం అయినోళ్లు లేరు. గడిచిన 37 ఏళ్లలో మరే నేత సాధించలేని ఘనతను యోగి సొంతం చేసుకున్నారు.
నాలుగోది
యూపీ ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన పలువురు నేతలు వ్యవహరించారు. కానీ.. వారిలో ఒక్క యోగి మాత్రమే సీఎంగా సక్సెస్ కావటమే కాదు.. మరోసారి అధికారాన్ని చేపట్టనున్నారు. యోగికి ముందు బీజేపీ నుంచి సీఎంలుగా అయిన వారిలో కల్యాణ్ సింగ్ కానీ రామ్ ప్రకాశ్ గుప్తా కానీ రాజ్ నాథ్ సింగ్ లు కానీ సీఎంగా విజయాన్ని సొంతం చేసుకున్నది లేదు. ఇలా.. యోగి తన తాజా విజయంతో నాలుగు రికార్డుల్ని సొంతం చేసుకున్నారని చెప్పక తప్పదు.
ఐదోది
నొయిడాకు వెళ్లినోళ్లు ఓడిపోతారనే సెంటిమెంట్ బద్ధలు
ఆరు
యూపీలో అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి బీజేపీ సీఎం
ఏడు
వరుసగా రెండోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఐదో నేత