Begin typing your search above and press return to search.
యూపీ సీఎంగా ఆ ఫైర్ బ్రాండ్ ఎంపికయ్యారు
By: Tupaki Desk | 18 March 2017 3:16 PM GMTఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీనియర్ ఎంపీ యోగి ఆధిత్యనాథ్ పేరు ఖరారైంది. ఈరోజు జరిగిన బీజేపీ శాసనసభా పక్షం యోగి ఆదిత్యనాథ్ ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన రేపు మధ్యాహ్నం 2.15 యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. యోగి ఆదిత్యనాథ్ 26 ఏళ్ల పిన్న వయసులోనే లోక్ సభకు ఎన్నికయ్యారు. గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఐదు సార్లు లోక్ సభకు ఎన్నికయి రికార్డు సృష్టించారు. హిందూ యువవాహనిని స్థాపించి హిందువల పక్షాన యోగి ఆదిత్యనాథ్ తన గళం వినిపిస్తున్నారు.
కాగా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రి వెంకయ్య హాజరయ్యారు. ఈ సమావేశానికి సీఎం రేసులో ఉన్న ఇద్దరు కీలక నేతలైన యోగి ఆదిత్యనాథ్ - పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య సమావేశానికి హాజరయ్యారు. కాగా ఈ సమయంలోనే యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పేరు ప్రముఖంగా వినిపించింది.అనంతరం ఆయన పేరు ఖరారైంది. కాగా, ఇద్దరు ఉపముఖ్యమంత్రులకు యూపీలో అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. ఇందుకోసం చంద్రబాబు రేపు లక్నో వెళుతున్నారు.
యోగి ఆదిత్యనాథ్ హిందువుల పక్షాన గళం వినిపించడంలో ముందుంటారు. ఆయన చేసిన కొన్ని కామెంట్లపై వివాదం కూడా చెలరేగింది. అయితే సీఎం పీఠం రేసులో యోగి ఆదిత్యనాథ్ పేరు అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. ఆర్ ఎస్ ఎస్ తో బలమైన సంబంధాలు ఆయనకు కలిసొచ్చే అంశంగా అపుడే అంచనా వేశారు. ఎన్నికలకు ముందుకు యూపీలో పార్టీ తరపున ప్రచారం కోసం 40 మంది ప్రధాన ప్రచారకర్తల పేర్లను బీజేపీ ప్రకటించగా ఈ జాబితాలో యోగి ఆదిత్యనాథ్ పేరు ఉంది. యూపీలోని హిందూ ఓట్లను కైవసం చేసుకునేందుకే ఆదిత్యనాథ్ పేరును జాబితాలో ఉంచారని సమాచారం. కాగా గతంలో ఆయోధ్యలో రామమందిరం నిర్మాణంపై సైతం ఆదిత్యనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీమసీదును కూల్చేసినప్పుడు కరసేవకులను ఎవరూ ఆపలేదని అక్కడ మందిర నిర్మాణం చేపడితే వారెలా ఆపగలరు? అని ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనుసరించిన కుహానా లౌకిక విధానాలు, ఇతర వర్గాల పట్ల బుజ్జగింపు వైఖరి వల్లే కైరానా నుంచి హిందువులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఇపుడు యూపీ ముఖ్యమంత్రిగా ఆయన ఎలాంటి విధానాలు అవలంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/