Begin typing your search above and press return to search.

భార‌త ఆర్మీకాద‌ట‌... మోదీ సేన అట‌

By:  Tupaki Desk   |   2 April 2019 10:21 AM GMT
భార‌త ఆర్మీకాద‌ట‌... మోదీ సేన అట‌
X
వివాదాస్ప‌ద బీజేపీ నేత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. లోక్‌ స‌భ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం యోగి ఆదివారం ఘజియాబాద్ లో ఓ ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్లు తీవ్రవాదులకు బిర్యానీ తినిపిస్తే... మోదీజీ సైన్యం (ఇండియ‌న్ ఆర్మీ అని ఆయ‌న భావ‌న‌) తీవ్రవాదులకు తుపాకీ గుళ్లు తినిపించింది అన్నారు.

భారత సైన్యాన్ని, మోదీ సైన్యం అని ఎలా అంటారు అంటూ ప్ర‌తిప‌క్షాలు యోగిపై తీవ్రంగా మండిప‌డ్డాయి. సైన్యాన్ని వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల‌కు, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు వాడుకున్న‌దే మీరు అంటూ బీజేపీపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుప‌డింది. లోక్ సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. ఇండియన్ ఆర్మీ యావత్ దేశానికి సైన్యమని.. కేవలం ప్రచారం చేసుకునే మంత్రులకు మాత్రమే కాదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక చతుర్వేది బీజేపీ పై ఫైర్ అయ్యారు.వెంటనే యోగి క్షమాపణ చెప్పాలని, లేక‌పోతే యోగి క్ష‌మాప‌ణ చెప్పేవ‌ర‌కు దేశ వ్యాప్త నిర‌స‌న‌లు తెలుపుతామ‌ని అన్నారు.

భారత సైన్యాన్ని చూసి దేశమంతా గర్వపడుతుందని, అది జాతి ఆస్తి అని, కేవలం బీజేపీ ఆస్తి కాదని మమత విమర్శించారు. బాలాకోట్ దాడుల‌ను కూడా బీజేపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు వాడుకుంద‌ని ఆమె త‌ప్పుపట్టారు. ఇంట‌ర్నెట్లో కూడా యోగి వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగుతోంది. యోగిని నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు. ఇండియ‌న్ ఆర్మీ బీజేపీ, వీహెచ్‌ పీ సొత్తు కాదు అని 130 కోట్ల మంది సొత్తు అని యోగిని తిడుతున్నారు.