Begin typing your search above and press return to search.
మోడీ శిష్యుడి స్కెచ్..రాముడి భారీ విగ్రహం
By: Tupaki Desk | 3 Nov 2018 9:19 AM GMTదేశంలో బీజేపీ భారీ విగ్రహాల రాజకీయం తెరలేపిందా? హిందువుల మనోభావాలను గౌరవించే ఏకైక పార్టీగా తామే నిలవాలనే క్రమంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోందా? మైనార్టీల సంక్షేమం కోసం అంటూ పలు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో హిందువుల మనోభావాలకు పెద్దపీట వేసే నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే సర్దార్ పటేల్ విగ్రహం ఏర్పాటుపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉండగా.. ఇప్పుడు మరో భారీ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో 151 మీటర్ల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సరయు నది పరివాహక ప్రాంతంలో ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడుతోంది.
``యోగి ఆధిత్యనాథ్ ముఖ్యమంత్రే కాకుండా ఓ పీఠాధిపతి. రాముడి జన్మస్థలమైన అయోధ్య అభివృద్ధికి ఆయనకు కొన్ని ఆలోచలున్నాయి`` అని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని సరయు నదీ తీరంలో మట్టిని పరీక్ష చేశాక ఏ ప్రాంతంతో విగ్రహం నెలకొల్పాలనే విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీపావళి తర్వాత యోగి ప్రకటన చేస్తారని సమాచారం. నర్మదా నదీ తీరంలో అతి పెద్ద పటేల్ విగ్రహన్ని ఏర్పాటు చేసి విమర్శలపాలైన బీజేపీ.. ఇప్పుడు మరో భారీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. పటేల్ విగ్రహానికి తాము వ్యతిరేకం కాదంటూనే.. ప్రధాని మోడీ విగ్రహాలను సైతం రాజకీయాలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని దేశంలోని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఐతే.. ఈసారి దేవుడి విగ్రహమైనందున కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తుందో లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తారో చూడాలి. మోడీ శిష్యుడిగా పేరొందిన యోగి ఆదిత్యనాథ్ తీసుకునే నిర్ణయం వెనుక లెక్కేంటో కమలనాథులే వెల్లడించాలి.